* నేడు సిద్దిపేట జిల్లాలో పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ పర్యటన.. కొండపోచమ్మ రిజర్వాయర్, మర్కుక్ పంప్ హౌస్, పాండవుల చెరువును పరిశీలించనున్న సీఎం మాన్, పంజాబ్ రాష్ట్ర అధికారులు.. మధ్యాహ్నం పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ బయల్దేరనున్న పంజాబ్ సీఎం.. కాళేశ్వరం ప్రాజెక్టు, భూగర్భ జలాల పెరుగుదల, మిషన్ కాకతీయ గురించి పంజాబ్ సీఎం బృందానికి తెలి యజేయడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం
* ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుల బెయిల్ పై ఇవాళ ఆర్డర్ ఇవ్వనున్న స్పెషల్ కోర్ట్.. లిక్కర్ స్కాంలో అభిషేక్ బోయిన్ పల్లి, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్, బినయ్ బాబులను అరెస్ట్ చేసిన ఈడీ.. ఇప్పటికే నలుగురు నిందితుల బెయిల్ పిటిషన్ల పై ముగిసిన వాదనలు.. తాజా అరెస్టులతో నిందితుల బెయిల్ ఆర్డర్ పై ఉత్కంఠ
* కాకినాడ: నేడు రెండో రోజు జిల్లాలో చంద్రబాబు పర్యటన.. ఉదయం జగ్గంపేట నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో సమావేశం.. మధ్యాహ్నం పెద్దాపురంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనున్న టీడీపీ అధినేత
* భద్రాచలం రామాలయం కొత్త ఈవోగా నేడు బాధ్యతలు స్వీకరించనున్న రమాదేవి
* నేడు సిద్దిపేట జిల్లాకి హీరో నాని, క్రికెటర్ అంబటి రాయుడు.. కేసీఆర్ క్రికెట్ టోర్నీ సీజన్-3 ప్రారంభించనున్న మంత్రి హరీష్ రావు, హీరో నాని, క్రికెటర్ అంబటి రాయుడు.. సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా క్రికెట్ పోటీలు.. క్రికెట్ సమరంలో పాల్గొననున్న 368 టీమ్‌లు
* తెలంగాణలో 1 టీచర్, 1 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ.. ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ.. ఫిబ్రవరి 23 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు
* ప్రకాశం : త్రిపురాంతకంలో తన సొంత నిధులతో నిర్మించిన త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయ ముఖద్వారాన్ని ప్రారంభించనున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
* ప్రకాశం : మహాశివరాత్రి సందర్భంగా జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి శ్రీశైలం, కోటప్పకొండ, భైరవకోన, త్రిపురాంతకం శైవ క్షేత్రాలకు 315 ప్రత్యేక బస్సులు..
* విశాఖ: నేటి నుంచి ప్రారంభం కానున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ.. నామినేషన్ దాఖలు చేయనున్న PDF అభ్యర్ధి డాక్టర్ కోరెడ్ల రమాప్రభ.. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సరస్వతి పార్క్ నుంచి ర్యాలీ.
* నేడు గుంటూరులో ముఖ్య అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్న మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ.. భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై చర్చించనున్న కన్నా..
* గుంటూరు: నేడు సీఐడీ కార్యాలయంలో హాజరుకానున్న టీడీపీ నాయకుడు చింతకాయల విజయ్.. ప్రభుత్వ పెద్దలపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల విషయంలో విచారణ చేయనున్న సీఐడీ అధికారులు.
* గుంటూరు: కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న పెన్షన్ విధానాన్ని పరిశీలించేందుకు నేటి నుంచి 22వ తేదీ వరకు జిల్లాలో పర్యటించనున్న కేంద్ర బృందం…
* బాపట్ల: నేడు రేపల్లె నియోజకవర్గం జనసేన కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్న జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ , ఇతర సీనియర్ నేతలు
* శ్రీ సత్య సాయి : లేపాక్షిని శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్ర స్వామి దేవాలయంలో రేపటి నుంచి ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు.
* శ్రీ సత్య సాయి: హిందూపురంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం
* పశ్చిమ గోదావరి జిల్లా: ఇరగవరం మండలం రేలంగిలో గడపగడపకు కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. అనంతరం తణుకులో పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి
* తిరుపతి: నేడు సత్యవేడు నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర.. రాయపేడు నుంచి ప్రారంభం.. కెవిబి పురం, రాజుల కండ్రిగ, వెంకటరెడ్డి కండ్రిగ, రాగిగుంట, తిమ్మనాయుడుగుంట, తిమ్మసముద్రం మీదుగా బైరేజి కండ్రిగ వరకు సాగనున్న పాదయాత్ర
* అనంతపురం : నేడు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్.. నామినేషన్ల దాఖలుకు నేటి నుంచి ఈనెల 23 వరకు అవకాశం.. ఈనెల 24 న నామినేషన్ల పరిశీలన. 27 వరకు ఉపసంహరణకు గడువు.
* అనంతపురం: గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలోని గుత్తి ధర్మవరం మధ్య జరుగుతున్న రైల్వే డబుల్ లైన్ మరమత్తుల కారణంగా పలు రైలు పాక్షికంగా రద్దు మరి కొన్ని రైళ్లు దారి మళ్లింపు
* నెల్లూరు జిల్లా: ముత్తుకూరులో జరిగే సచివాలయ కొనసారథులు వాలంటీర్ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
* కడప : అపూర్వ కళ్యాణ మండపంలో కడప అసెంబ్లీ గృహ సారథులు, కన్వీనర్లు, వాలంటీర్లతో సమావేశం.. హాజరు కానున్న ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా
* కడప : నేడు మునిసిపల్ గ్రౌండ్ లోని అయ్యప్ప స్వామి ఆలయ పునర్ నిర్మాణం శంకుస్థాపన మహోత్సవం..
* కడప : కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం ఆలయంలో కొత్త ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం..
* అనకాపల్లి జిల్లా: నేడు రోలుగుంట మండలం శరభవరంలో ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు సినీ నటుడు ఆలీ పర్యటన.. పోతరాజు బాబు కళ్యాణోత్సవంలో పాల్గొననున్న ఆలీ
* కడప : నేటి నుంచి యోగివేమన యునివర్సిటీ డిగ్రీ పరీక్షలు.. మొదటి, మూడవ సెమిస్టర్ పరీక్షలు.. పరీక్షలు రాయనున్న 30 వేల మంది విద్యార్థులు..
* ఏలూరు జిల్లా: నేడు సీఎం క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ణు కలిసి వైసీపీలో చేరనున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే జై మంగళ వెంకటరమణ.