ఈ నెల 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా వరంగల్ కమిషనరేట్ పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగం ప్రధాన మంత్రి పర్యటించే ప్రాంతాల్లో గగనతలాన్ని నో ప్లై జోన్ ప్రకటిస్తూ వరంగల్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేసారు. ఈ ఉత్తర్వులను అనుసరించి ప్రధాన మంత్రి భద్రత దృష్ట్యా నేటి నుండి 8తేదీ వరకు వరంగల్, హనుమకొండ నగరానికి 20 కిలో మీటర్ల వ్యాసార్థంలో గగనతలాన్ని నో ప్లై జోన్ గా ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కావున డ్రోన్, రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్, పారాగ్లైడర్ లాంటివి ఎగరవేయడం పూర్తిగా నిషేధించబడ్డాయి. ఎవరైన వ్యక్తులుగాని, సంస్థలుగాని ఉత్తర్వులను అతిక్రమించినట్టయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసారు.
Also Read : Kishan Reddy : కుటుంబ పాలన, అవినీతిపై మోడీ పోరాటం చేస్తున్నారు
ట్రై సిటీ పరిధిలో 144 సెక్షన్
అలాగే భారత ప్రధాని పర్యటన సందర్భంగా ట్రై సిటీ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ ఉత్తర్వులను అనుసరించి గుమికూడటం, ర్యాలీ, సభలు, సమావేశాలు నిర్వహించడం, మైకులు, స్పీకర్లు ఏర్పాటు చేయడంపై నిషేదిండం అమలు చేయబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు. నిషేదం రేపు ఉదయం 6గంటల నుండి 8తేదీ సాయంత్రం 6గంటలకు అమలులో వుంటుందని. ఈ ఉత్తర్వులను అతిక్రమించినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని పోలీస్ కమిషనర్ వెల్లడించారు.
Also Read : Salaar : సలార్ సినిమా కోసం భారీగానే ఖర్చు చేసిన ప్రశాంత్ నీల్..?
ఇదిలా ఉంటే.. గతంలో ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించిన సమయంలో.. కొందరు నిరసన కారులు బ్లాక్ బెలూన్‌లను ఎగువేశారు. అయితే.. దీంతో ఆ హీలియం నింపిన ఆ బ్లాక్ బెలూన్‌లు ప్రధాని మోడీ పర్యటిస్తున్న హెలికాప్టర్ దగ్గరగా వెళ్లాయి. దీంతో ఎన్పీజీ ఉన్నతాధికారులు రాష్ట్ర పోలీసుల భద్రతపై వైఫల్యాలపై మండిపడ్డారు. ఈ క్రమంలో.. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు.