కెజిఎఫ్ సినిమా తో ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ను సంపాదించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా సలార్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈరోజు సలార్ సినిమా టీజర్ను ఎంతో గ్రాండ్ గా విడుదల చేసారు.విడుదల అయిన సలార్ టీజర్ మ్యానియా మాములుగా లేదు..ఈ టీజర్ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూసారు ప్రభాస్ ఫ్యాన్స్. ఎట్టకేలకు సలార్ టీజర్ విడుదల కావడంతో ఫ్యాన్స్ ఎంతో ఖుషి గా వున్నారు. టీజర్ విడుదల అయిన క్షణాల్లోనే బాగా వైరల్ అయింది.టీజర్ ను మాస్ విజువల్స్ అండ్ ఎలివేషన్ తో మరింత పవర్ఫుల్ గా చూపించారు.ప్రశాంత్ నీల్ టీజర్ కట్ చూసిన తర్వాత ఈ సినిమా కు 1000 కోట్లు కలెక్షన్స్ ఖాయం అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.. ఇదిలా ఉండగా ఈ సినిమా టీజర్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి.
ఈ టీజర్ వచ్చిన తర్వాత ఈ సినిమా బడ్జెట్ గురించి అనేక చర్చలు జరిగాయి. దీంతో ఈ సినిమా బడ్జెట్ విషయం కూడా బాగా వైరల్ గా మారింది. ఈ సినిమా ను ప్రశాంత్ నీల్ 400 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ వార్త నెట్టింట బాగా వైరల్ అయ్యింది.. ఆయన తెరకెక్కించిన కెజిఎఫ్ రెండు భాగాలూ కలిపినా కూడా ప్రశాంత్ నీల్ ఈ రేంజ్ లో ఖర్చు చేయలేదు.. దీంతో సలార్ సినిమా కోసం మేకర్స్ బాగానే ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. హోంబలే సంస్థ వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.సలార్ పార్ట్ 1 ను సెప్టెంబర్ 28 న ఎంతో గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తం గా విడుదల చేయనున్నారు.ఆదిపురుష్ సినిమా తో బాగా నిరాశ లో ప్రభాస్ కు ఈ సినిమా అద్భుత విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.