8 న వరంగల్ కి ప్రధాని మోడీ వస్తున్నారని, రైల్వే శాఖకు సంబంధించి వాగన్ తయారీ యూనిట్ కి శంకుస్థాపన చేస్తారన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంవత్సరానికి 2,400 వ్యాగన్ ల తయారీ.. మొదటి దశలో 521 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. జాతీయ రహదారుల కోసం ఇప్పటికే లక్ష 20 వేల కోట్లు తెలంగాణ లో ఖర్చు చేస్తుందని, మోడీ మరో 5 వేల 500 కోట్ల రోడ్లకు శంకుస్థాపన చేస్తారన్నారు.
Also Read : Manchu Lakshmi: నిహారికకు ఏం తక్కువ.. వారి కెరీర్ ను పాడుచేస్తున్నారు
కుటుంబ పాలన, అవినీతిపై మోడీ పోరాటం చేస్తున్నారని ఎన్నో పోరాటాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని, వందలాది మంది తెలంగాణ కోసం బలిదానం అయ్యారన్నారు. ఈ రోజు తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బంది అయిందని, బందీ అయిన తెలంగాణకు స్వేచ్ఛ స్వతంత్రము కల్పించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. దీని కోసం బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో పాతర వేయాలని కంకణం కట్టకున్నారని ఆయన అన్నారు.
Also Read : Bholaa Shankar: ‘భోళా శంకర్’కి బాధ్యతలు పూర్తి చేసిన మెగాస్టార్ చిరంజీవి
కల్వకుంట్ల కుటుంబాన్ని ఫార్మ్ హౌస్ కి పరిమితం చేయాలని ప్రజలు డిసైడ్ అయ్యారని ఆయన వెల్లడించారు. నేను కాపలా కుక్కల ఉంటాను అని కేసీఆర్ అన్నారు… దళితులకు వెన్నుపోటు పొడిచారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతులకు ఉచిత యూరియా, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెడతా అన్నాడు అతిగతి లేదని ఆయన విమర్శించారు. నిరుద్యోగ భృతి లేదు, మండలానికో హాస్పిటల్ లేదు… నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించలేదు … కేజీ 2 పీజీ లేదని ఆయన అన్నారు. అంతేకాకుండా.. గిరిజన బంధు ఎక్కడ పోయింది… దళిత బంధు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కమిషన్ కే పరిమితం అయిందని ఆయన విమర్శలు గుప్పించారు.