SS Rajamouli : ఆర్ఆర్ఆర్ మూవీ రాజమౌళి ఒరిజినల్ వెర్షన్ కాదా.. అన్ని మార్పులు చేసారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్ ‘ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..హాలీవుడ్ దిగ్గజ దర్శకులు సైతం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీని ఎంతగానో మెచ్చుకున్నారు..కాగా ఈ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ నెల (మార్చి) 24కు రెండు సంవత్సరాలు. తెలుగు చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకు వచ్చిన చిత్రమిది.భారతీయ ప్రేక్షకులతో పాటు విదేశీ ప్రేక్షకులకు, సినీ ప్రముఖులకు ‘ఆర్ఆర్ఆర్’ ఎంతగానో నచ్చింది. అయితే ఆర్ఆర్ఆర్ మూవీకీ సంబంధించి దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాలు తెలియజేసారు.ప్రేక్షకులంతా చూసిన ‘ఆర్ఆర్ఆర్’ వేరు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన ఒరిజినల్ వెర్షన్ వేరు. సినిమా అంతా పూర్తి అయ్యాక మరీ శాడ్ ఫిలింలా ఉందని ఫీలై, యంగ్ టైగర్ ఎన్టీఆర్,ఆయనకు జోడీగా నటించిన ఫారిన్ యాక్ట్రెస్ ఒలీవియా మోరిస్ క్యారెక్టర్లలో మార్పులు చేశారట.’ఆర్ఆర్ఆర్’ ఒరిజినల్ వెర్షన్ లేదా డిలీట్ చేసిన సీన్స్ లో జెన్నీ అలియాస్ జెన్నీఫర్ (ఒలీవియా) క్యారెక్టర్ మరణిస్తుందని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చెప్పారు.
ప్రస్తుతం రాజమౌళి జపాన్ లో ఉన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ షోకి అటెండ్ అయ్యారు. షో అనంతరం ప్రేక్షకులతో ముచ్చటిస్తూ… ”మేం తొలుత జెన్నీ తన అంకుల్ గదిలోకి వెళ్లి వాళ్ల ప్లాన్స్ తెలుసుకునే సన్నివేశాలు రాశాం. అయితే, క్లైమాక్స్ దగ్గర పడుతుండటంతో అవన్నీ అవసరం లేదని ఫీల్ అయ్యాం. డీటెయిల్స్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదనుకున్నాం. భీంను కలిసిన జెన్నీ, మళ్లీ ఇంటికి వచ్చినప్పుడు ఆమె బూట్లకు మట్టి ఉండటంతో ఏదో చేసిందని ఆంటీకి అనుమానం వస్తుంది. అలాగే, జైలు నుంచి రామ్ ను భీం తప్పించి… బ్రిటిషర్ల మీద ఎటాక్ చేసినప్పుడు జెన్నీకి అంకుల్ గన్ గురి పెడతారు. వాళ్ళను లొంగిపోమని చెబుతాడు.లొంగిపోవడానికి ముందు షూట్ చేయడంతో జెన్నీ మరణిస్తుంది. ఒరిజినల్ వెర్షన్ లో జెన్నీ చచ్చిపోతుంది. నేను అంత సాడ్ ఫిల్మ్ తీయాలని అనుకోలేదు” అని రాజమౌళి చెప్పారు.’ఆర్ఆర్ఆర్’ ఒరిజినల్ వెర్షన్ లో జెన్నీఫర్ క్యారెక్టర్ మార్చడంతో ఎన్టీఆర్ క్యారెక్టర్ సన్నివేశాలు కూడా మారాయట. ఒకవేళ ఒరిజినల్ వెర్షన్ రిలీజ్ అయితే ఎలా ఉండేదో అని అభిమానులు చర్చించుకుంటున్నారు.
Also Read
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
తాజావార్తలు
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
-
Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
-
Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!