TDP MP Candidates List: ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో.. అన్ని పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో ముందు వరుసలో ఉండగా.. పొత్తుల వల్ల టీడీపీ-జనసేన-బీజేపీ అభ్యర్థుల ఎంపిక కాస్త ఆలస్యం అయ్యింది.. అయితే, పొత్తులు తేలిపోవడంతో.. మెజార్టీ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు ఎంపీ అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది.. ఇవాళ టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలకు ఛాన్స్ ఉంది అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు.. 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుంది టీడీపీ. ఇవాళ సాయంత్రానికల్లా బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉండగా.. బీజేపీ ఎంపీ అభ్యర్థులపై క్లారిటీ రానుండడంతో తమ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలకు సిద్దమవుతుంది టీడీపీ.
సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ మొత్తం 144 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీచేయనుంది.. ఇప్పటికే రెండు విడతల్లో 128 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. మరో 14 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించాల్సి ఉంది.. ఎంపీ అభ్యర్థుల స్థానాలపై టీడీపీ అధినేత చంద్రబాబు తుది కసరత్తు చేస్తు్నారు.. మొత్తంగా 17 స్థానాల్లో పోటీ చేయనుండగా.. ఇప్పటికే పది స్థానాలకు పైగా క్లారిటీకి వచ్చారట సైకిల్ పార్టీ చీఫ్.. మిగిలిన స్థానాలపై కసరత్తు కొనసాగుతోంది..
టీడీపీ క్లారిటీ వచ్చిన ఎంపీ స్థానాలు.. అభ్యర్థుల పేర్లు ఇవి ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది.
* శ్రీకాకుళం – రామ్మోహన్ నాయుడు
* విశాఖ – భరత్
* అమలాపురం – గంటి హరీష్
* విజయవాడ – కేశినేని చిన్ని
* గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్
* నరసరావు పేట – లావు శ్రీకృష్ణ దేవరాయలు
* ఒంగోలు – మాగుంట రాఘవ రెడ్డి
* నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
* నంద్యాల – బైరెడ్డి శబరి
* చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాద్