తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. క్షతగాత్రులు పద్మావతి వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. వారిని ఈవో శ్యామలరావు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారని.. 41 మందికి గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తేలినట్లు చెప్పారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
READ MORE: KTR : ఏసీబీ కార్యాలయంకు వెళ్లేముందు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
“ప్రాథమిక చికిత్స అనంతరం కొందరిని వైద్యులు డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారికి చికిత్స జరుగుతోంది.” అని వెల్లడించారు. ఇదిలా ఉండగా..మంత్రులు అనిత.. ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్ రుయా ఆసుపత్రిలోని మార్చరీ వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులను కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బరాయుడు వారికి వివరించారు. బాధితులను మంత్రులు పరామర్శించారు. కుటుంబీకులను కోల్పోయిన బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
READ MORE: AP BJP: నీ దర్శనానికి వచ్చిన భక్తులకు ఏర్పాట్లు చేయలేనందుకు మమ్ములను క్షమించండి స్వామీ..