తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో నిన్న జరిగిన తోపులాట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తైంది.
తిరుమల శ్రీవారి వైకుంఠద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో నిన్న జరిగిన తోపులాట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇందులో ఆరుగురు భక్తులు చనిపోయారు. మరికొందరు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు... అసలు ఏ సమయానికి ఏం జరిగింది. ఎలా జరిగింది? అనే పూర్తి వివరాలతో నివేదికను జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నివేదిక సమర్పించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని అందులో పేర్కొన్నారు.
తిరుమల తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. నెల రోజులుగా రోజుకో సమీక్ష పేరుతో వైకుంఠ ఏకాదశికి చేశారు.. పనిచేసేవాళ్ళు తక్కువై పోయారు. పర్యవేక్షించే వారు ఎక్కువై పోయారు. వ్యవస్థను పూర్తి గా వైఫల్యం చెందించారు. టీటీడీ, పోలీసులు, టీటీడీ నిఘా వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందారు. క్రైమ్ డీఎస్పీ పద్మావతి పార్క్ లో పశువులు మంద తోలినట్లు భక్తులను తోలారు. గత ప్రభుత్వం హయంలో ఎంతో సమర్థవంతంగా పనిచేశాం.
తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. క్షతగాత్రులు పద్మావతి వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. వారిని ఈవో శ్యామలరావు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారని.. 41 మందికి గాయాలయ్యాయని తెలిపారు.
ఏపీలో ఈనెల 4 నుంచి 12 వరకు జరగనున్న ఈఏపీసెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి శ్యామలరావు వెల్లడించారు. జూలై 4 నుండి 8 వరకు ఇంజినీరింగ్ పరీక్ష లు జరుగుతాయని.. జూలై 11,12 తేదీలలో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష జరుగుతుందని వివరించారు. మొత్తం 122 సెంటర్లలో పరీక్షలు జరుగుతాయని శ్యామలరావు వివరించారు. రెండు సెంటర్లు తెలంగాణలో ఉంటాయని తెలిపారు. ఈఏపీసెట్ పరీక్షల కోసం మొత్తం 3 లక్షల 84…