KTR : తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడం, హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్‌ను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రతిష్టాత్మక ఫార్ములా-ఈ కార్ రేసును రాష్ట్రానికి తీసుకువచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ వాహన రంగంలో హైదరాబాద్‌ను ప్రధాన గమ్యస్థానంగా అభివృద్ధి చేయాలన్న దీర్ఘకాలిక దృష్టితో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించామని తెలిపారు.
తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో ఇన్నోవేషన్, రీసెర్చ్, , తయారీ రంగాల్లో పెట్టుబడులు అందించడం ద్వారా ఉద్యోగాలు సృష్టించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ-మొబిలిటీ వీక్ సందర్భంగా రాష్ట్రం రూ.12,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగిందని తెలిపారు. ఈ ఘనత తెలంగాణ ప్రభుత్వం సాధించగలిగిన ఘన విజయమని అభిప్రాయపడ్డారు.
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి
ఐతే, నిందారోపణలు చేయడమే లక్ష్యంగా, చిన్న మనస్తత్వంతో రాజకీయాలు చేసే కొందరు నాయకులకు ఫార్ములా-ఈ రేసు వెనుక ఉన్న అసలు ఉద్దేశం అర్థం కాలేదని కేటీఆర్ విమర్శించారు. కానీ, విజ్ఞులైన తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని, తమ ప్రభుత్వ ధ్యేయాన్ని అనుసరించి అభినందించారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సత్యం, న్యాయం ఎప్పటికీ గెలుస్తాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, తెలంగాణ ప్రజలు తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించి ఆదరించారని కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అన్నారు.
అయితే.. ఏసీబీ కార్యాలయంకు వెళ్లేముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ సైనికుడుగా నిర్మలమైన హృదయంతో చెబుతున్నానని, హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలపడానికి ఎంతో ప్రయత్నం చేసానన్నారు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా బామ్మర్డులకు, నా కొడుకు కు కాంట్రాక్టులు ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేని కొనడానికి వెళ్లిన దొంగను కాదు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
నిజం నిలకడగా తెలుస్తుందని, మా దృష్టి మరల్చలేరని ఆయన అన్నారు. నా మీద కేస్ పెడితే మా కేడర్‌ను దృష్టి మళ్లించాలని చూస్తున్నావన్నారు కేటీఆర్. నీ వల్ల కాదు.. న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏ ప్రశ్నలు అయినా అడుగు.. తెలంగాణ కోసం అవసరం అయితే నా ప్రాణాలు ఇస్తాను.. అని కేటీఆర్ అన్నారు.
DaakuMaharaaj : బాలయ్యలో నాకు అది కనిపించలేదు : శ్రద్ధా శ్రీనాథ్