శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద జరిగిన ఘటన తిరుపతి వాసుల్లో కలకలాన్ని రేపింది. తాజాగా ఈ అంశంపై ఏపీ బీజేపీ స్పందించింది. “ఏడు కొండలు వాడా… స్వామి మమ్ముల్ని క్షమించు… భక్తకోటిని క్షమించండి. నీ దర్శనానికి వచ్చిన వారికి ఏర్పాట్లు చేయలేనందుకు మమ్ములను క్షమించు.” అని కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని క్షమాపణలు కోరింది.
READ MORE: Top Headlines @9AM : టాప్ న్యూస్
మరోవైపు తిరుపతి తోపులాటలో భక్తుల మృతిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి చరిత్రలో ఇటువంటి దుర్ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. గాయాలైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. “ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన అందరిపై పాలక మండలి కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా న్యాయం చేయాలి.” అని పేర్కొన్నారు.
READ MORE: RRR Custodial Torture Case : ఆర్‌ఆర్‌ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక వ్యక్తి అరెస్ట్..