అప్పుడు బీఆర్ఎస్ చేసింది.. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తే తప్పా..!
అప్పుడు బీఆర్ఎస్ చేస్తే సరైంది.. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తే తప్పా? స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ ప్రతినిధుల పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరామన్నారు. వరంగల్ నుంచి కడియం కావ్యకి పోటీ చేసే అవకాశం కల్పించిన సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలిపారు. మాపై ఉంచిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తుందన్నారు.
ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ చేతులెత్తేసింది..! బండి కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలుపై చేతు లెత్తేసిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ రైతు దీక్షలో వున్న ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మి ఓటేసిన రైతులు మోసపోయారన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చేతులెత్తేసిందన్నారు. కోట్లాది రూపాయల ప్రకటనలతో 6 గ్యారంటీలను అమలు చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
అవనిగడ్డ జనసేనలో ఆరని చిచ్చు..! బుద్ధప్రసాద్‌పై సంచలన వ్యాఖ్యలు
అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీలో.. మండలి బుద్ధప్రసాద్ చేరికతో మొదలైన చిచ్చు ఆరడంలేదు.. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు టీడీపీలో టికెట్ దక్కలేదు.. దీంతో, ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో.. పార్టీ కండువా కప్పుకున్నారు.. ఈ సారి ఆయన జనసేన పార్టీ నుంచి గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది.. అంతేకాదు.. జనసేనాని నుంచి టికెట్‌పై హామీ వచ్చిన తర్వాతే.. ఆయన సైకిల్ దిగారని టాక్ నడుస్తోంది. కానీ, అవనిగడ్డ అభ్యర్థిపై జనసేన హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక, మండలి బుద్ధ ప్రసాద్… జనసేన పార్టీలో చేరికను నిరసిస్తూ ఈ రోజు అవనిగడ్డలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జనసేన నేత విక్కుర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్‌పై విచురుకుపడ్డారు విక్కుర్తి శ్రీనివాస్.
కేబుల్ బ్రిడ్జ్ వేసి అభివృద్ధి అంటున్నారు.. కేసీఆర్ పై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ కేబుల్ బ్రిడ్జ్ వేసి హైదరాబాద్ అభివృద్ధి అంటున్నారని రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి,దానం నాగేందర్ విజయం కోసం సన్నాహక మీటింగ్ ఏర్పాటు చేశామన్నారు. తుక్కుగుడా బహిరంగ సభ కోసం మాట్లాడినామన్నారు. 10 లక్షల మందిని బహిరంగ సభకు తరలిస్తామన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా నాగేందర్ ను గెలిపించే విధంగా ముందుకు సాగుతున్నామన్నారు. 8న నాంపల్లి లో ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో మరో సారి మీటింగ్ ఉందన్నారు.
కేసీఆర్ ను తిట్టి బతుకుదాం అనుకుంటోంది కాంగ్రెస్
కేసీఆర్ ను తిట్టి బతుకుదాం అనుకుంటోంది కాంగ్రెస్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకృతి సమస్య కొంత …కాంగ్రెస్ పార్టీ సమస్య కొంతతో రైతాంగం నష్టపోతోందన్నారు. వర్ష పాతం నమోదు అయిన నీటి నిల్వ చేయడం లో కాంగ్రెస్ పార్టీ విఫలం అయిందన్నారు. ఎండకాలం లోనూ ఒక్క చెరువు ఎండి పోకుండా కేసీఆర్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ నీళ్లు వెనక్కి తీస్కుని పంటలను కేసీఆర్ రక్షించారన్నారు. కేసీఆర్ ఉండి ఉంటే .. ఒక ఎకరం పంట ఎండకపోతుండే అంటున్నరు రైతులు అని తెలిపారు.
ఏపీ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన.. షర్మిల ఎక్కడ్నుంచంటే..!
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులను వెల్లడించింది. ఏపీలో 114 అసెంబ్లీ అభ్యర్థులతో పాటు 5 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ వెల్లడించింది. కడప నుంచి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల బరిలోకి దిగుతున్నారు. ఇక రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ.శీలం, కర్నూలు నుంచి రామపుల్లయ్య యాదవ్, కాకినాడ నుంచి పల్లంరాజు పోటీ చేస్తున్నారు.
మీ పార్టీలో పుల్ల పెడుతుంది ఎవరో తెలుసుకో
ఈ నెల 6న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సభా ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంగళశారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 వ తేదీ సాయంత్రం సభ నిర్వహించనున్నట్లు.. సభకు తెలంగాణ జనజాతర పేరు ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు. జన జాతర వేదిక మీది నుండి మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాహుల్..ప్రియాంక గాంధీ హాజరవుతారని, ఐదు గ్యారంటీలు వేదిక మీదనుండి ఇస్తామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కి ప్రత్యేకమని, సోనియాగాంధీ కి మరీ ప్రత్యేకమన్నారు. సోనియాగాంధీ దయ.. ప్రేమ వల్ల రాష్ట్రం ఏర్పాటు అయ్యిందన్నారు రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలు విస్మరించింది
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలు విస్మరించిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రైతు సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె అన్నారు. రైతులు పండించిన ధాన్యానికి క్వింటాలుకు 500 బోనస్ ,నష్టపోయిన పంటలకు ఎకరాకు 25 వేల పరిహారం ఇవ్వాలి, డిమాండ్ చేస్తూ ఈ రోజు కొంగరా కలాన్ లోని రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో జిల్లా ఎమ్మెల్యేలు అరకపురి గాంధీ,యాదయ్య,ప్రకాష్ గౌడ్,ఎమ్మెల్సీ సురభి వాణి, ఇతర ముఖ్య నేతలు అదనపు కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు.
కేసీఆర్, కేటీఆర్ మాటలు గత రాజరిక దర్బార్‌ను తలపిస్తున్నాయి
కేసీఆర్, కేటీఆర్ మాటలు గత రాజరిక దర్బార్ ను తలపిస్తున్నాయన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి. ఇవాళ ఆయన గాంధీ భవన్‌లో మీడియతో మాట్లాడుతూ.. ఆ దర్బార్ మాటలు వినివిని తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టిన సిగ్గు రావడం లేదని ఆయన విమర్శించారు. పోలీసుల రూపంలో ప్రైవేట్ సైన్యాన్ని కేసీఆర్ పెంచి పోషించారని, ఆ సైన్యంతోనే ఫోన్ ట్యాపింగ్ చేయించారన్నారు. ఆ సైన్యమే ఒక్కొక్కటి బయట పెడుతున్నా. కేటీఆర్ ఇంకా ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల సభ్య సమాజం సిగ్గు పడుతోందన్నారు. లీగల్ నోటీసులు ఇస్తానని ట్విట్టర్ పిట్ట కేటీఆర్ చెబుతున్నాడని, మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఎక్కడున్నాడు? అని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ కు తెలంగాణ ఉద్యమం గురించి తెలుసా? అని ఆయన ఆయన అన్నారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు బీజేపీ అమలు చేయలేదు
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ లు బీజేపీ అమలు చేయలేదని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. విదేశాల్లో ఉన్న నల్ల ధనం నోట్ల రద్దీతో వైట్ మనీ గా మారిపోయిందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర కు చట్ట బద్ధత కల్పించాలన్నారు జీవన్ రెడ్డి. ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేశారని, క్రూడాయిల్ దరలు తగ్గినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెరిగాయన్నారు జీవన్ రెడ్డి. ప్రభుత్వాన్ని బీజేపీ వ్యాపార సంస్థగా మర్చివేసిందని, నేడు దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు.
అధికార దాహంతోనే పొత్తు.. టీడీపీపై కీలక వ్యాఖ్యలు
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో నెల్లూరు లోక్ సభ వైసీపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధికి విక్రమ్ రెడ్డి రూపొందించిన మానిఫెస్టోను విజయ సాయి రెడ్డి విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం అధికార దాహంతోనే ఇప్పుడు మళ్లీ టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. త్రిబుల్ తలాక్, సీఏఏ (CAA) బిల్లులకు వైసీపీ సపోర్ట్ చేయలేదని తెలిపారు. కేవలం దురుద్దేశంతో వైసీపీపై చంద్రబాబు బురద చల్లుతున్నారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.