Temperature Dropped: తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి పెరిగిపోతోంది. ఉష్ణోగ్రతలు తగ్గడానికి తోడు శీతల గాలులు బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో ఇంటిలో ఉన్నప్పటికీ జనంలో వణుకు తగ్గడం లేదు. దీంతో చలిమంటలను జనం ఆశ్రయిస్తున్నారు. స్వెట్టర్లు, రగ్గులు కప్పుకున్నా.. చలి మాత్రం వాయించేస్తోంది. దీంతో ఇదెక్కడి చలిరా బాబు అంటూ జనం గజగజా వణుకుతున్నారు.
Read Also: Cabinet Meeting: నేడు కేబినెట్ సమావేశం.. పెన్షన్ రూ.3వేలకు పెంపు..!
తెలంగాణ వ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో .. సిటీవాసులు వణికిపోతున్నారు. పగటి పూట కూడా సాధారణ ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో.. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజుల పాటు పగటిపూట కంటే రాత్రి పూట ఉష్ణోగ్రతలు పడిపోతాయని.. సాదారణం కన్నా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 12 నుంచి 13 డిగ్రీల మధ్య నమోదు అవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Read Also: Shah Rukh Khan : షిరిడి సాయిబాబా మందిరంలో షారుఖ్ ఖాన్ ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్..
ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం సహా పలుజిల్లాలను చలి వణికిస్తోంది. ఉధృతంగా పొగమంచు కురుస్తుండడంతో.. వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారుతోంది. పలుచోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పదిడిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరోవైపు ఏపీలోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పతనమవుతున్నాయి. అరకు, లంబసింగి లాంటి చోట్ల జనం చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇక, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు తగ్గే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు.. మరోవైపు, వాతావరణంలో మార్పు శరీర రోగ నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక, శీతాకాలంలో ఇమ్యూనిటీ ఖచ్చితంగా తగ్గుతుంది. అయితే, విటమిన్ సీ ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలని.. రోగనిరోధక శక్తి పెంచుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు..