తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా.. దక్షిణ తెలంగాణతో పోలిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.
ఎండాకాలం రానే వచ్చింది. ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. ఎండలకు తోడు వేడిగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. బుధవారం (12-03-25) కృష్ణా జిల్లా ఉంగుటూరు, ఉయ్యూరు మండలాలు, పార్వతీపురంమన్యం జిల్లా పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి, జియమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పాలకొండ, సీతంపేట, వీరఘట్టం మండలాలు,…
చలికాలంలో ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టడం వల్ల చాలా మందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. చల్లని, పొడి గాలి, అలాగే వాతావరణ మార్పులు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పుడు దాని ప్రభావం భూమిపైనే కాకుండా చంద్రునిపై కూడా పడింది. లాక్‌డౌన్ కారణంగా అనేక దేశాలలో పరిశ్రమలు మూసివేశారు. రోడ్లపై వాహనాలు కనిపించలేదు. కాలుష్యంలో భారీ తగ్గింపు నమోదైంది. ఈ క్రమంలో.. లాక్డౌన్ ప్రభావం భూమి నుండి చంద్రునికి విస్తరించిందని ఇప్పుడు ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. దీని కారణంగా చంద్రుని ఉష్ణోగ్రత కూడా సాధారణం కంటే తక్కువగా మారింది.
TG Health Department: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకుల కార్యాలయం పలు సూచనలు చేసింది.
ఎండా కాలంలో ఎండ తీవ్రత నుంచి కాపాడుకునేందుకు ఇళ్లల్లో ఏసీలను పెట్టుకుంటున్నారు. కాని వాటి నిర్వహణను గాలికొదిలేస్తున్నారు. వేసవి ఉక్కపోత నుంచి రక్షణ పొందేందుకు పెట్టించుకున్న ఏసీలు కాస్త పేలుతున్నాయి. అందుకే ఏసీని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
ఢిల్లీ వాసులు ఎండ వేడిమి నుంచి కాస్త తెప్పరిల్లారు. ఉదయం నుంచి భానుడు భగభగమండిపోయాడు. ఇక బుధవారం రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. 52.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. దీంతో హస్తిన వాసులు వేడి, ఉక్కపోతతో అల్లాడిపోయారు
ఢిల్లీ అగ్నిగుండంగా మారింది. ఎన్నడూ లేనంత రికార్డ్ ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలో ఈరోజు 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలోని ముంగేష్‌పూర్‌లోని వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 2.30 గంటలకు 52.3 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే.. రికార్డ్ ఉష్ణోగ్రత నమోదైన అనంతరం తాజాగా ఢిల్లీలో పలు చోట్ల వర్షం కురుస్తుంది.
Weather : వాయువ్య భారతం విపరీతమైన వేడిని ఎదుర్కొంటోంది. చాలా ప్రాంతాల్లో ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తోంది. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలోని నజాఫ్‌గఢ్‌లో అత్యధికంగా 47.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటి పెరుగుతున్నందున, తెలంగాణకు ఇది అత్యంత కఠినమైన వేసవి సీజన్లలో ఒకటిగా మారుతుందని వాతావరణ నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో చెదురుమదురు వర్షాలు కురిసే ముందు, మే మొదటి వారం వరకు తీవ్రమైన వేడిగాలులు కొనసాగుతాయని వారు అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌కు మించి నమోదయ్యాయి. అయితే.. ఇవాళ ఎండలకు హైదరాబాద్ మండిపోయింది. ఈ సమ్మర్‌లోనే హైదరాబాద్‌లో ఇవాళ హాటెస్ట్ డే రికార్డ్ అయ్యింది.…