ఆర్థిక సంవత్సరానికి ముందు కేంద్రం విడుదల చేసే బడ్జెట్ గణాంకాలను అనుసరించి రాష్ట్రాలు తమ తమ బడ్జెట్ ను రూపొందించుకుంటాయి. ప్రతి రాష్ట్రానికి ఆనవాయితీగా ఎఫ్ ఆర్ బి ఎం పరిమితులను ముందస్తుగా కేంద్రం వెల్లడిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే తెలంగాణకు ఇచ్చే ఎఫ్ ఆర్ బి ఎం పరిమితిని 54 వేల కోట్లుగా కేంద్రం ప్రకటించింది. దీనిని అనుసరించి తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ ను రూపొందించుకున్నది. కేంద్రం అకస్మాత్తుగా తెలంగాణ రాష్ట్ర ఎఫ్ ఆర్ బి ఎం పరిమితిని 39 వేల కోట్లకు కుదించింది.
Also Read : Indian-Origin Teen: కెనడాలో భారతీయ సంతతికి చెందిన యువకుడి దారుణ హత్య.. నిందితుడు అరెస్ట్
తద్వారా రాష్ట్రానికి అందాల్సిన 15 వేల కోట్ల నిధులు తగ్గాయి. ఆర్థికంగా పటిష్టంగా వున్న రాష్ట్రాలకు అదనంగా 0.5 శాతం నిధుల సేకరణకు ఎఫ్ ఆర్ బి ఎం పరిమితి వుంటుంది. ఆర్థికంగా అత్యంత పటిష్టంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈ సౌలభ్యాన్ని కూడా పొందనీయకుండా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తామంటెనే 0.5 శాతం రుణ పరిమితికి అనుమతిస్తామనే వ్యవసాయ వ్యతిరేక రైతాంగ వ్యతిరేక నిబంధనను ముందుకు తెచ్చి బలవంత పెట్టింది.
Also Read : North Korea: కిమ్ కూతురు అంటే మామూలుగా ఉండదు.. యువరాణి తరహా సౌకర్యాలు
దాంతో సుమారు 6 వేల కోట్ల రూపాయలను రాష్ట్రం కోల్పోయింది. తద్వారా అవి 15 వేల కోట్లు ఇవి 6 వేల కోట్ల రూపాయలు వెరసి కేంద్ర ప్రభుత్వ విధానాల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన 21 వేల కోట్ల రూపాయల నిధులు ఆగిపోయి, రాష్ట్రం ఆర్థికంగా నష్ట పోయింది. అక్కడితో ఆగకుండా రాష్ట్రానికి రావాల్సిన 20 వేల కోట్ల బడ్జెటేతర నిధులను కూడా రాకుండా కేంద్రం నిలిపివేయించింది. తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 40 వేల కోట్లకు పైగా నిధులు రాకుండా పోయాయి. కేంద్ర అనుసరిస్తున్న అసంబద్ధ విషయాలను ఇటు రాష్ట్ర ప్రజల దృష్టికి అటు దేశ ప్రజల దృష్టికి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం బావిస్తున్నది. అందులో భాగంగా డిసెంబర్ నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి అసెంబ్లీ వేదికద్వారా ప్రజలకు పూర్తి సమాచారాన్ని అందించి చర్చించాలని నిర్ణయించింది.