దేశంలో బీజేపీ విధానాలను ఎండగట్టడమే సీపీఐ పార్టీ లక్ష్యమన్నారు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. తెలంగాణ వ్యాప్తంగా జన యాత్రలు నిర్వహించిందని, దేశంలో బీజేపీ ప్రమాదకర స్థాయికి చేరుకుందన్నారు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని ఎదుర్కోవడమే కమ్యూనిస్టుల ప్రథమ లక్ష్యమన్నారు. ఎన్నికల ముందు బీజేపీ చేసిన వాగ్దానాలు ఈ తొమ్మిదేళ్లలో ఈ ఒక్క వాగ్ధానాన్ని నెరవేర్చలేదన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు బీజేపీ చేస్తుంది ఆయన ఆరోపించారు. లౌకిక విలువలను పునాదులను సైతం పేకలించడానికి ప్రయత్నం చేస్తున్నదని, అతుకల బొంతగ రాజ్యాంగం ఉందని ప్రచారం చేస్తుందన్నారు.
Also Read : Special Package For Ap: ప్రత్యేక హోదా స్థానంలోనే ప్రత్యేక ప్యాకేజి
అందుకే మనుధర్మాన్ని తీసుకురావాలని చూస్తోందన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికలో బీజేపీ ని చిత్తు చిత్తుగా ఓడించడమే కమ్యూనిస్టు పార్టీల ప్రథమ కర్తవ్యమన్నారు. బీజేపీ హిందువుల అభివృద్ధికి పని చేసే పార్టీ అని, అది తెలుసుకోకుండా బీజేపీ భ్రమలో ఉన్నారు చాలా మందన్నారు. కుల మతాల మధ్య చిచ్చులు పెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తుందని, దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఐక్యం కావలిసిన అవసరం ఉందన్నారు. బీఅర్ఎస్ బీజేపీని వ్యతిరేకిస్తోంది కాబట్టే మద్దతు ఇస్తున్నామని, మునుగోడు ఫలితాలు వచ్చాక కమ్యూనిస్టుల ఎత్తుగడలు, ఆలోచనలు అందరికీ అర్ధమయ్యాయన్నారు.
Also Read : Sriramanavami Pooja: శ్రీరామనవమికి చేయవలసిన, చేయకూడని పనులేంటి?
బీజేపీ విధానాలను వ్యతిరేకించే పార్టీలతో కలిసి ముందుకు పోతామని, తెలంగాణ అంటే నిజాంకు వ్యతిరేకంగా పోరాడినా చరిత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. 4000 మంది కమ్యునిస్టు యోధులు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర ఎర్రజెండాలకు వుందని, అలనాటి చరిత్ర కలిగిన తెలంగాణలో బీజేపీ కాషాయ పార్టీని అడుగు పెట్టనివ్వమన్నారు. ఇప్పటి నుంచి చావైనా, బ్రతుకైనా కమ్యూనిస్టు పార్టీలు ఐక్యంగా ఉంటాయని, కలిసి ముందుకు నడుస్తాయని ఆయన స్పష్టం చేశారు.