సకలగుణాభిరాముడు యావత్ లోకానికి ఆదర్శం. శ్రీరాముడి పెళ్ళంటే ఎంతో వైభవంగా జరుగుతుంది. చైత్ర నవరాత్రుల చివరి రోజైన శ్రీరామ నవమి చైత్ర మాసం శుక్లపక్షం తొమ్మిదో రోజున శ్రీరాముడు జన్మిస్తాడు. అందుకే ఆ రోజున శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఈ వేడుకలకు రాముని భక్తులు అనేక ఏర్పాట్లు చేస్తుంటారు. రామనవమి హిందువులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ సందర్భంగా కొన్ని పనులను ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇంకొన్ని పనులను అసలే చేయకూడదు. శ్రీరాముడి కల్యాణం చూస్తే సకల పాపాలు పోతాయని, కుటుంబానికి, ఈసమాజానికి అంతా మంచి జరుగుతుందని అంతా నమ్ముతారు.
Read Also:Bhadrachalam Srirama Navami: భద్రాచలం వెళ్లినవారు ఏం నేర్చుకోవాలి?
శ్రీరామనవమికి ఏం చేయాలంటే..
* చాలామంది రాముడి విగ్రహాన్ని ఊయలో ఉంచి రామ నవమి సంబరాలు జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం ఉండటం శుభప్రదంగా భావిస్తారు. అంతేకాదు సంతోషం, శ్రేయస్సు కలుగుతాయి. చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి.
* శ్రీరామనవమి నాడు నిద్రలేచిన వెంటనే భగవంతుడికి దండం పెట్టుకోవాలి.
* అయోధ్యలోని సరయూ నదిలో పుణ్యస్నానాలు ఆచరించడం వల్ల గత, వర్తమాన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం.
* రామచరిత మానస్, రామ్ చాలీసా, శ్రీరామ రక్షా స్తోత్రాన్ని కలిపి పఠించడం మంచిది. రామ కీర్తనలు, భజనలు, స్తోత్రాలు కూడా పఠించాలి.
* హనుమాన్ చాలీసా పఠించడం, నిరుపేదలకు ఉన్నంతలో దానం చేయడం మంచిది. శ్రీరామనవమి నాడు అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది.
* శ్రీరాముడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు. కాబట్టి ఆ సమయంలో శ్రీరామనవమి పూజ చేయడం అత్యంత ప్రయోజనకరం.
* దశమి తిథి వరకు తొమ్మిది రోజుల పాటు అఖండ దీపం వెలిగించాలి. రోజూ ఉదయం, సాయంత్రం దీపాలు వెలిగించండి.
*ఈ రోజు నిజాయితీగా ఉండండి. మీరు చేసే ప్రతి పనిని చిత్తశుద్ధితో చేయండి. ఫలితం దేవుడిపై వదిలేయండి.
శ్రీరామనవమికి చేయకూడని పనులు
* ఎటువంటి పరిస్థితుల్లోనూ శ్రీరామనవమి నాడు మాంసాహారం, ఆల్కహాల్ ను తీసుకోకూడదు.
* శ్రీరామనవమి పర్వదినాన ఇంట్లో వంట చేసేటప్పుడు ఉల్లిపాయలు, వెల్లుల్లిని కూరల్లో వేయకూడదు.
* నవమి నాడు జుట్టు కత్తిరించడం లేదా షేవింగ్ చేయడం మంచిది కాదు.
* రాముడి ఆశయాలను పాటించడానికి ప్రయత్నించండి. శ్రీరాముడి శోభాయాత్రలో పాల్గొనండి. శ్రీరాముడి ఆలయంలో సేవ చేయండి.. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి.