ప్రముఖ దేవస్థానం శ్రీశైలంలో వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకిది శుభవార్తే. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్ళే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది దేవస్థానం. ధర్మప్రచారంలో భాగంగా తెల్లరేషన్ కార్డు భక్తులకు ఉచితంగా సామూహిక సేవలు ఏర్పాటు చేసింది దేవస్థానం.
దేవస్థానం మొదటిసారిగా ఆర్ధికంగా వెనుకబడిన భక్తుల కోసం ప్రతి నెలలో ఒకరోజున ఉచిత సామూహిక సేవలకు శ్రీకారం చుట్టింది.
Read Also:Jagapathi Babu: ‘రంగస్థలం’ సర్పంచ్.. పుష్ప 2 లో.. సుకుమార్ సినిమాటిక్ యూనివర్స్ ..?
ఈనెల 25 న అరుద్రోత్సవం సందర్భంగా చంద్రావతి కళ్యాణమండపంలో శ్రీస్వామివారి సామూహిక అభిషేకం నిర్వహించనుంది. ప్రతి నెల 250 టికెట్స్ ని శ్రీశైల దేవస్థానం వెబ్ సైట్ లో భక్తులకు అందుబాటులో ఉంచనుంది దేవస్థానం. ఉచిత సామూహిక సేవలకు సంబంధించిన టికెట్స్ ని ఈనెల 19 న ఆన్లైన్ లో పెట్టనుంది దేవస్థానం. ఉచిత సామూహిక సేవలలో పాల్గొనదలచిన భక్తులు ఆన్లైన్లో తెల్లరేషన్ కార్డుని తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని దేవస్థానం పేర్కొంది.
Read Also: Murali Vijay : ఇష్టం లేకున్నా మీ కోసం ఆడాలా?