Raghava Lawrence : హీరో లారెన్స్ గురించి తెలిసిందే. తన సంపాదనలో ఎంతో మందికి సాయం చేస్తూనే ఉంటాడు. తన దగ్గరకు వచ్చిన వారికి కాదనకుండా తనవంతుగా సాయం అందిస్తాడు. ఇప్పుడు ఓ దివ్యాంగురాలికి చేసిన సాయం లారెన్స్ ను మరో ఎత్తులో నిలబెట్టింది. తాజాగా దివ్యాంగురాలు శ్వేత కుటుంబానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. శ్వేతకు ఇప్పటికే స్కూటీ కొనిచ్చాడు. ఆమె నడిచేందుకు సపోర్ట్ గా ఉండే వాటిని కొనిచ్చాడు. కానీ ఆమె పూరి గుడిసెలో…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీ (BC)లకు శుభవార్త చెప్పారు. పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు కేంద్రం ఇచ్చే రాయితీకి అదనంగా రూ.20 వేలు సబ్సిడీ రూపంలో అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.330, 22 క్యారెట్లపై రూ.300 తగ్గింది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,900గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.87,160గా నమోదైంది.
OYO : ఓయో మ్యాజిక్ కొనసాగుతుంది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ.166 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత సంవత్సరం కంపెనీ లాభం రూ. 25 కోట్లు. ఇందులో ఆరు రెట్లు పెరుగుదల ఉంది.
కొత్త కారు కొనాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం. భారత మార్కెట్లో దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. హ్యుందాయ్ హ్యాచ్‌బ్యాక్ నుంచి ఎస్‌యూవీ విభాగంలో అనేక కార్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తుంది.
నిరుద్యోగులకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ పండుగలాంటి వార్తను నారా లోకేష్ ప్రకటించారు.
జాతీయ పసుపు బోర్డును ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి పీయూష్ గోయల్, ఎంపీ అరవింద్ ధర్మపురి వర్చువల్‌గా ప్రారంభించారు. నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు కార్యకలాపాలు కొనసాగనున్నాయి.
నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు పండించే రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, తనను గెలిపిస్తే పసుపు బోర్డును ఏర్పాటు చేయిస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చి.. అనేక ఇబ్బందులు పడ్డ అరవింద్ అనుకున్నది సాధించినందుకు ఆనందంగా ఉందన్నారు. బోర్డు ఏర్పాటుకు సహకరించిన మంత్రి పీయూష్ గోయల్…
జాతీయ పసుపు బోర్డ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ బీజేపీ అని తెలిపారు. సాక్షాత్ ప్రధాని మంత్రి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిన, రైతులు అడుగడుగునా మమ్మల్ని అవమానించారన్నారు. పసుపు బోర్డు ఇస్తామని చెప్పి హామీ నెరవేర్చాం. రాబోయేది కాషాయ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.
నేడు జాతీయ పసుపు బోర్డు ప్రారంభం కానుంది. వర్చువల్‌గా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించనున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ లో ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది.