ఐపీఎల్ 2023 సీజన్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని పూర్తిగా క్రికెట్ కి వీడ్కోలు పలకబోతున్నాడు అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే రిటైర్మెంట్ గురించి ఎంఎస్ ధోని పరోక్షంగా హింగ్ కూడా ఇచ్చాడు. 2020 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ అట్టర్ ప్లాప్ అయినా.. 2021 సీజన్ నాలుగోసారి టైటిల్ గెలిచి అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చింది. 2022 సీజన్ లో 14 మ్యాచ్ ల్లో 10 పరాజయాలు అందుకున్న ధోని సేన.. ఈ సారి మొదటి ఐదు మ్యాచ్ ల్లో 3 విజయాలను అందుకుంది.
Also Read : Bandi Sanjay: చేవెళ్ల నేతలతో బండి సంజయ్ భేటీ.. అమిత్ షా పర్యటన ఏర్పాట్లపై చర్చ
రిటైర్మింట్ అనేది ప్రతీ ప్లేయర్ వ్యక్తిగత విషయం.. ఇష్టం లేకపోయినా తమ కోసం ఆడాలని జనాలు ఒత్తిడి చేయకూడదు.. ధోని 15 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఇకనైన తన ఇష్టం వచ్చినప్పుడు తప్పుకునే స్వేచ్ఛ ఇవ్వాలి అని టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ విజయ్ అన్నారు. ఇష్టం లేకపోయినా అభిమానుల కోసం ఆడాలని కోరడం కరెక్ట్ కాదు.. ధోని ఎక్కడికి వెళ్లినా రిటైర్మింట్ ఎప్పుడు అనే ప్రశ్న వస్తోంది.. ఎప్పుడు చెప్పాలో మాహీకి తెలుసు.. ఇలా ప్రతీసారి అడిగి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు.. ధోని రిటైర్మెంట్ గురించి మళ్లీ మళ్లీ అడగకూడదని మురళీ విజయ్ చెప్పాడు.
Also Read : Karimnagar: అనుమానాస్పద మృతిని చేధించిన జమ్మికుంట పోలీసులు..
అభిమానులు ఇలా ధోని రిటైర్మెంట్ గురించి చెప్పడం నాక్కూడా ఇబ్బందిగా ఉంది.. నేను ఈ మధ్యనే రిటైర్మెంట్ తీసుకున్నా కాబట్టి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు.. ఆట కోసం అన్నీ ఇస్తాం.. ఆటే జీవితం అని అనుకుంటాం.. అని మురళీ విజయ్ వెల్లడించారు. అయితే ఆ సమయం వచ్చాక అన్ని వదిలేయాల్సి వస్తుంది.. అది పూర్తిగా వ్యక్తిగత విషయం.. దాంట్లో కలగజేసుకోవడం కరెక్ట్ కాద.. కాబట్టి మీరు కాస్త హద్దులు తెలుసుకుని వ్యవహరించాలంటూ మురళీ విజయ్ హెచ్చరించాడు.