Jagapathi Babu: ‘రంగస్థలం’ సర్పంచ్.. పుష్ప 2 లో.. సుకుమార్ సినిమాటిక్ యూనివర్స్ ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagapathi Babu: లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లా సుకుమార్ కూడా సినిమాటిక్ యూనివర్స్ ఏమైనా మొదలు పెట్టాడా..? అంటే నిజమే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అందుకు కారణం.. పుష్ప 2. అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెల్సిందే. ఇక అల్లు అర్జున్ పుట్టినరోజున విడుదలైన వీడియో, పోస్టర్ ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్పతో బన్నీని ఐకాన్ స్టార్ ను చేసిన సుక్కు.. ఈసారి గ్లోబల్ స్టార్ ని చేసేస్తాడేమో. ఇక ఇప్పటికే ఈ సినిమాలో విలన్స్ భారీ ఎత్తున ఉన్నారు. సునీల్, ఫాహద్ ఫాజిల్.. లాంటి స్టార్స్ ఉండగా.. ఇంకో విలన్ ను పెట్టాడట సుకుమార్. ఆయన ఎవరో కాదు.. విలక్షణ నటుడు జగపతి బాబు. పుష్ప 2 లో జగ్గూభాయ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు.
Adipurush: జై శ్రీరామ్.. మాకు అన్ని భాషల్లో కావాలి
Also Read
” నేనెప్పుడూ సుకుమార్ సినిమాలో చేయడానికి ఎదురుచూస్తూ ఉంటాను. ఎందుకంటే.. మీకెవ్వరికి తెలియదు తర్వాత ఏమవుతుందో అని. పుష్ప 2 ఒక ఛాలెంజ్. నాకు ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం. అంతకు ముందు చిత్రాలా లాగే ఈ చిత్రంలో కూడా నాకోసం సుక్కు ఒక బెస్ట్ పాత్రను రాశాడు. అతనితో పనిచేయడానికి నేనెప్పుడూ రెడీ గా ఉంటా.. పుష్ప నాకు నచ్చిన చిత్రం” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వార్త తెలియడంతో అల్లు అభిమానులు సుక్కు మల్టీవర్స్ అని చెప్పుకొచ్చేస్తున్నారు. సుక్కు దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమా గుర్తుందిగా .. అందులో జగ్గు భాయ్.. సర్పంచ్ ఫణింద్ర భూపతిగా నటించాడు. ఒక పాముగా జగ్గూభాయ్ ను సుకుఆర్ చూపించాడు. చివరిలో రామ్ చరణ్ పామును కొట్టి చంపినట్లు చూపించారు కానీ, జగపతి బాబును మాత్రం చూపించలేదు. ఇక ఆ సర్పంచ్ పాత్ర.. పుష్ప 2 లో ఉంటుందేమో అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. పుష్ప 2 కథను సుక్కు చాలా పకడ్బందీగా రాసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. సుక్కు.. టాలీవుడ్ లోకేష్ కనగరాజ్ అని చెప్పుకోవచ్చు అని నెటిజన్లు అంటున్నారు. మరి ఈ వార్తలో ఎంత నిజమున్నదో చూడాలి.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!