Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండోసారి సిట్ అధికారుల ముందు విచారణకు శ్రవణ్ రావు హాజరయ్యారు. ఈ రోజు (ఏప్రిల్ 2న) విచారణకు రావాలంటూ శ్రవణ్ రావుకు గత విచారణ సమయంలో సిట్ నోటీసులు జారీ చేసింది. అలాగే, 2023లో తాను వినియోగించిన మొబైల్ ఫోన్లను తీసుకుని రావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే, ఐదు రోజుల క్రితం సుమారు ఏడు గంటల పాటు సిట్ విచారణను ఎదుర్కొన్న శ్రవణ్ రావు. సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో మరోసారి విచారణకు పిలిచింది సిట్. ఇక, ఇవాళ్టి విచారణలో ఎలాంటి అంశాలను శ్రవణ్ రావును సిట్ అధికారులు అడుగుతారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది.