Motorola edge 60 Fusion: 6.7 అంగుళాల డిస్ప్లే, 5500mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌లతో మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ లాంచ్
- మోటరోలా తన ఎడ్జ్ 60 సిరీస్‌లో భాగంగా కొత్త స్మార్ట్‌ఫోన్ ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ను భారతదేశంలో విడుదల
- 6.7 అంగుళాల డిస్ప్లే, 5500mAh బ్యాటరీ, IP69 రేటింగ్
- Mediatek Dimensity 7400 SoC ప్రాసెసర్‌తో వస్తుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motorola edge 60 Fusion: మోటరోలా తన ఎడ్జ్ 60 సిరీస్‌లో భాగంగా కొత్త స్మార్ట్‌ఫోన్ ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ముందుగా ప్రకటించినట్టుగా, ఈ ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. 6.7-అంగుళాల 1.5K కర్వ్డ్ pOLED స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ Mediatek Dimensity 7400 SoC ప్రాసెసర్‌తో వస్తుంది. ఇందులో 12GB వరకు RAMను అందిస్తోంది. ఎడ్జ్ 60 ఫ్యూజన్ కెమెరా విభాగంలో మంచి పనితీరు అందించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ ఫోన్‌లో 50MP ప్రధాన కెమెరా (Sony LYT-700C సెన్సార్, OIS) కలిగి ఉంది. అలాగే 13MP అల్ట్రా-వైడ్ కెమెరా మాక్రో ఆప్షన్‌తో అందించబడింది. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీతో లభిస్తుంది.
Read Also: Off The Record: అక్కడ టీడీపీ, జనసేన వార్ ఓపెనైపోయిందా..? ఆయన వ్యవహారశైలి అగ్గి రాజేసిందా…?
Also Read
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 పై రన్ అవుతుంది. మోటరోలా మూడు మెజర్ OS అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాల భద్రతా నవీకరణలు అందించనున్నట్లు హామీ ఇచ్చింది. ఇది దీర్ఘకాలిక వినియోగదారుల కోసం మంచి అవకాశం. ఈ ఫోన్ MIL-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను పొందింది. 16 రకాల మిలిటరీ టెస్టులను ఈ డివైస్ విజయవంతంగా పూర్తి చేసింది. ఇది -20°C నుండి 60°C వరకు ఉష్ణోగ్రతలను తట్టుకోగలదు. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా దీని పనితీరు స్థిరంగా ఉంటుంది.
ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌లు కలిగి ఉంది. 1.5 మీటర్ల లోతులో 30 నిమిషాల పాటు ఉన్న కూడా రక్షణ కల్పిస్తుంది. అలాగే ముందు భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. ఇది స్క్రాచ్, గ్లాస్ బ్రేక్ నుండి రక్షణ ఇస్తుంది. ఇకపోతే, మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది 68W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. దినితో కేవలం కొద్ది నిమిషాల్లోనే వేగంగా ఛార్జ్ అవుతుంది. మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ధర వివరాలు చూస్తే.. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999, 12GB RAM + 256GB మోడల్ రూ. 24,999 కి అందుబాటులో ఉంది.
తాజావార్తలు
-
Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
-
Balakrishna – Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
-
New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!