ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. హరీశ్ రావుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం కొట్టేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావుతో పాటు మాజీ డీసీపీ రాధా కిషన్ రావుకు కూడా ఉపశమనం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్…
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ పూర్తయింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రెండు వారాల పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రభాకర్ రావును విచారించింది. 14 రోజుల కస్టడీ విచారణ నిన్నటితో ముగియగా.. ఈరోజు ఉదయం వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఆయన్ను కుటుంబ సభ్యులకు సిట్ అధికారులు అప్పగించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రభాకర్ రావు ఇంటికి వెళ్లిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కస్టోడియల్ విచారణ పూర్తయిన తర్వాత సిట్…
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ఇవాళ్టితో ముగియనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రెండు వారాల పాటు ప్రభాకర్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బృందం విచారిస్తోంది. డిసెంబర్ 26వ తేదీన ప్రభాకర్ రావును విడిచి పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండో వారం విచారణలో ప్రభాకర్ రావు నుంచి సిట్ బృందం కీలక సమాచారం రాబట్టింది. మొదట విచారణకు సహకరించని ప్రభాకర్ రావు.. పూర్తి ఆధారాలు ముందు ఉంచడంతో…
Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ లకు సిట్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాను అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. నాతో పాటు అగ్ర నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేయడంతో వల్ల ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు జారీ చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Phone Tapping : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం (SIT) మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిట్ అధికారులతో సీపీ సజ్జనార్ మొదటిసారిగా కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో కేసు పురోగతిని సమీక్షించడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఈ కేసులో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని, వారు ఎంతటి…
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ఆరో రోజు కూడా కొనసాగుతోంది. ఈ విచారణ రేపటితో ముగియనున్న నేపథ్యంలో, సిట్ (SIT) బృందం విచారణను మరింత వేగవంతం చేసింది. గత ఆరు రోజులుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియలో ప్రధానంగా సాంకేతిక అంశాలతో పాటు, అప్పటి రాజకీయ నాయకుల ఫోన్లను ఏ విధంగా ట్యాపింగ్ చేశారనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి ప్రభుత్వ పెద్దల…
Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలు సేకరించే దిశగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును సిట్ అధికారులు మూడో రోజు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. సిట్ దృష్టి సారించిన అంశాలు… దర్యాప్తులో భాగంగా, ట్యాపింగ్ కోసం ఎలాంటి సాంకేతిక పరికరాలు, కిట్లను ఉపయోగించారు, ట్యాపింగ్కు ఎవరు ఆదేశాలు ఇచ్చారు ,పబ్లిక్ డేటా ట్యాపింగ్ను…
Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును వెంటనే సిట్ (SIT) ముందు సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇప్పటివరకు అరెస్ట్ నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పిస్తూ వచ్చినప్పటికీ, తాజాగా ఈ రక్షణను తొలగించి, కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు విషయంలో ప్రభాకర్ రావు విచారణకు ఏ…