Tammineni Sitaram: చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఈ జన్మకి జైల్లోంచి బయటకి రారని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు బాధగా ఉండవచ్చు అన్నారు. బాబు 13 చోట్ల సంతకాలు చేసారని.. స్కిల్ స్కాం రెడ్ హ్యాండెడ్ క్రైం అని తెలిపారు. చంద్రబాబు మెదటి నుంచి స్కాంల వ్యక్తేనని సీతారాం దుయ్యబట్టారు. దొరకనంత వరకూ దొర, ఇప్పుడు దొరికారని విమర్శించారు. బాబు పై చాలా కేసులలో స్టేలు ఉన్నాయని సీతారాం తెలిపారు.
Read Also: Minister KTR: గ్రూప్ 1 వాయిదా పడేలా చేసింది విపక్ష పార్టీలే..
జగన్ పై కేసులు పెట్టి, 16 నెలలు జైల్లో పెట్టారని సీతారాం తెలిపారు. ఏం తేల్చగలిగారు.. సిబిఐనే చేతులు ఎత్తేసిందన్నారు. భువనేశ్వరి అన్నట్లు నిజమే గెలవాలంటే స్టేల్ లు వెకేట్ చేసుకుని రావాలన్నారు. నిజమే గెలిస్తే బాబు జీవితకాలం జైల్లో ఉండాలని స్పీకర్ తెలిపారు. చంద్రబాబు తన నిర్దోశత్వాన్ని రుజువు చేసుకోవాలని..
రాష్ర్ట ఖజానాకు ట్రైస్టిగా, కాపాలాగా ఉండాలని విమర్శించారు.
Read Also: Mega Family: పిక్ ఆఫ్ ది డే.. కన్నుల పండుగగా ఉందే
మరోవైపు రోజుకి కోట్లు తీసుకునే లాయర్లు నీ తరుపున వాధిస్తున్నారు కదా.. నిర్దోషత్వాన్ని రుజువు చేసుకోండని స్పీకర్ తెలిపారు. ఇందులో ఏం చేయటానికి లేదు .. చంద్రబాబుపై వన్ బై వన్ ఇంకా కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. చంద్రబాబుని జగన్ మెహన్ రెడ్డి ఏం చేయలేదని.. కేంద్ర ప్రభుత్వ సంస్థలు సిబిఐ, ఎన్ఫోర్స్ మెంట్, జిఎఫ్టీ, సెబి లాంటి సంస్థలు దర్యాప్తు చేశాయని సీతారాం పేర్కొన్నారు.