Mega Family: మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీలో వాలిపోయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్ళికి ఇంకో మూడు రోజులు మాత్రమే ఉండడంతో కుటుంబం మొత్తం ఇటలీలో దిగింది. నవంబర్ 1 న వీరి పెళ్లి ఇటలీలో జరగనుంది. ఇక ఈ పెళ్ళిలో మెగా కుటుంబం మొత్తం సందడి చేయనుంది. నిన్ననే మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీలో వాలిపోయింది. పెళ్ళికి రెండు రోజులు సమయం ఉండగా.. చిరు ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తూ కనిపించింది. అందుకు సంబంధించిన ఫొటోలను రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఒక లేక్ దగ్గర మెగా కుటుంబం మొత్తం ఫొటోలో దర్సనమిచ్చింది. ఇక ఈ ఫొటోలో చిరు- సురేఖ దంపతులు. వారి పిల్లలు.. వారి పిల్లలు కనిపించారు.
Suresh Gopi: లేడీ జర్నలిస్ట్ పై నటుడు అసభ్య ప్రవర్తన.. వీడియో వైరల్
పెద్ద కూతురు సుస్మిత, ఆమె భర్త.. ఇద్దరు పిల్లలు. శ్రీజ.. ఆమె ఇద్దరు పిల్లలు. రామ్ చరణ్, ఉపాసన.. వారి ముద్దుల తనయ క్లింకార. ఇక ఉపాసన తల్లిదండ్రులు, చెల్లి, ఆమె భర్త.. ఇలా మెగా కుటుంబం మొత్తం ఒకే ఫ్రేమ్ లో కనిపించి కనువిందు చేశారు. ముఖ్యంగా ఈ ఫొటోలో అందరి చూపు మెగా వారసురాలిపైనే ఉంది. ఇక ఫొటోలో ఆమె ఫేస్ ను కవర్ చేసినా.. లేక్ వాటర్ లో క్లింకార ప్రతిబింబం కనిపిస్తుంది. దీంతో అభిమానులందరూ.. మెగా వారసురాలి ముఖం కనిపిస్తుంది అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోపక్క ఈ ఫోటో చూడడానికి కన్నుల పండుగగా ఉందే అని కామెంట్స్ పెడుతున్నారు. మరి మెగా ప్రిన్స్ పెళ్లి అయ్యేలోపు ఎలాంటి పిక్ ఆఫ్ ది డే ఫోటోలు వస్తాయో చూడాలి.