Minister KTR: కేసీఆర్‌ను విమర్శించే నాయకులకు కూడా సర్కార్ పథకాలు అందుతున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అయినా కేసీఆర్ ఏమి చేసిండు అని విపక్ష నేతలు అంటారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌వీ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ప్రచారం గురించి కార్యకర్తలకు మంత్రి సూచించారు. బీజేపీ బతుకుతుంది సోషల్ మీడియా మీదేనని, వాళ్ళు చేసింది ఏమి లేదని మంత్రి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో సోషల్ మీడియాను ప్రత్యర్థుల మీద బ్రహ్మాస్త్రంలా వాడుకోవాలని నేతలు, కార్యకర్తలకు సూచనలు చేశారు. కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధి పనులను సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పెట్టాలన్నారు. చేసింది చెప్పాలి, చేయబోతున్నది కూడా ప్రజలకు చెప్పాలని ఆయన సూచించారు.
Also Read: Minister Harish Rao: డీకే శివకుమార్‌కు మంత్రి హరీశ్ థ్యాంక్స్.. డీకే నిజాలే చెప్పారు!
గ్రూప్ 1 వాయిదా పడేలా చేసింది విపక్ష పార్టీలేనని ఆయన ఆరోపించారు. డిసెంబర్ 3 తర్వాత జ్యాబ్ కాలెండర్ కూడా రూపొందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఉస్మానియా కాదు.. ఎక్కడికి అంటే అక్కడికి వస్తామని, భయపడేదే లేదని మంత్రి అన్నారు. పనికిమాలిన ప్రతిపక్షాలకు మేము జవాబుదారీ కాదని కేటీఆర్ పేర్కొన్నారు. నాలుగు ఓట్ల కోసం నాలుగు డైలాగ్‌లు కొట్టే సన్నాసులను నమ్మవద్దన్నారు.