Sharad Pawar: లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన (యూబీటీ)తో కలిసి పోరాడిన శరద్ పవార్ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన వైఖరిని ప్రదర్శించింది. పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువ స్థానాల్లోనే పోటీ చేశాం.. కానీ, అసెంబ్లీలో మాత్రం మా పార్టీ రాజీపడదని శివసేన, కాంగ్రెస్ పార్టీలకు స్పష్టం చేశారు. ఇక, ఎన్సీపీ అధినేత శుక్రవారం పూణెలో పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, కొత్తగా ఎన్నికైన ఎంపీలతో భేటీ అయ్యారు. కాగా, ఎన్సీపీ ( ఎస్పీ) పూణె అధ్యక్షుడు ప్రశాంత్ జగ్తాప్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివసేన, కాంగ్రెస్‌లతో పొత్తు చెదిరిపోకుండా ఉండేందుకే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌సీపీ తక్కువ స్థానాల్లో పోటీ చేసిందని శరద్ పవార్ ఆ మీటింగ్ లో పార్టీ నాయకులు, కార్యకర్తలకు చెప్పినట్లు జగ్తాప్ చెప్పుకొచ్చారు.
Read Also: Market Mahalakshmi OTT: ఓటీటీలోకి మాస్ అమ్మాయి లవ్ స్టోరీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇక, పూణె, బారామతి, మావల్, షిరూర్ లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితిని కూడా శరద్ పవార్ సమీక్షించారని పూణె చీఫ్ ప్రశాంత్ జగ్తాప్ తెలిపారు. ప్రతి ఒక్కరు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఎంపీలు, ఎమ్మెల్యేలను కోరారు. సీట్ల పంపకాల సమయంలో ఎన్ని సీట్లు అడుగాలి అనే దానిపై ఇంకా పార్టీ నిర్ణయించలేదన్నారు. కాగా, ఈ ఏడాది చివర్లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌లోని ఎమ్మెల్యే కోటా నుంచి 11 స్థానాలకు జరిగే ఉప ఎన్నికలు అధికార మహాయుతికి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాదీ (ఎంవీఏ)కి అగ్ని పరీక్ష లాంటిది. రాష్ట్రంలోని 288 మంది సభ్యుల సభలో 14 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
Read Also: Osmania Hospital: నిన్న నల్ల దుస్తులు.. నేడు కళ్ళకు గంతలు.. ఉస్మానియాలో జూడాలు నిరసన..
కాంగ్రెస్, శివసేన (UBT), ఎన్సీపీ (ఎస్పీ) ఒక్కో అభ్యర్థిని ఎమ్మెల్సీగా ఎన్నుకునే అవకాశం ఉంది. బీజేపీకి ఐదుగురు అభ్యర్థులు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. మిగిలిన నలుగురిని మిత్రపక్షాలైన శివసేన( షిండే), ఎన్సీపీ ( అజిత్) పార్టీకి వదిలివేసే ఛాన్స్ ఉంది. జూలై 12న ఎన్నికలు జరగనుండగా.. జూన్ 25న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే, బీజేపీ 103 మంది ఎమ్మెల్యేలు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీకి 40, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌కు 37 మంది ఎమ్మెల్యేలు ఉండగా, శివసేన (యూబీటీ)కి 15 మంది, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.