మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహారాష్ట్ర ఎన్నికల గురించి ఆయన ట్వీట్ చేశారు. మహారాష్ట్ర, ఛత్రపతి శివాజీ మహారాజ్ భూమి, మరాఠా పరాక్రమానికి చిహ్నంగా, సనాతన ధర్మ రక్షకునిగా నిలుస్తుందన్నారు. శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, నాయకత్వ వారసత్వంతో తరాలకు స్ఫూర్తినిచ్చే ఈ పుణ్యభూమిని సందర్శించడం గర్వకారణంగా ఉందన్నారు.
PM Modi: కాంగ్రెస్, దాని కూటమి మహావికాస్ అఘాడీ(ఎంవీఏ)పై ప్రధాని నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. మంగళవారం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అవినీతిలో కాంగ్రెస్ కూటమికి ‘‘డబుల్ పీహెచ్‌డీ’’ విమర్శించారు. చిమూర్‌లో జరిగిన సభకు హాజరైన మోడీ బీజేపీ మహాయుతి అభ్యర్థుల తరుపున ప్రచారం చేశారు.
BJP Manifesto : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, యువతపై ప్రత్యేక దృష్టి సారించారు.
Maharashtra Election: నేటి రెండ్రోజుల పాటు మహారాష్ట్రలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నిర్వహించే మెగా రోడ్ షోలు, బహిరంగ సభల్లో కమలం పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు.
Maharashtra: నవంబర్ 20వ తేదీన జరగనున్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ఇటీవల ముగిసింది. కాగా 288 అసెంబ్లీ స్థానాల్లో పోటీ పడేందుకు మొత్తం 7,994 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగినట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది.
Maharashtra Elections 2024: మహారాష్ట్ర ఎన్నికల వైపు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నవంబర్ 20న ఆ రాష్ట్రంలోని 288 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు ప్రధాన కూటములు పోటీ పడుతున్నాయి.
Uddhav Thackeray: బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రశేఖర్ బావాన్‌కులే, శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేపై విరుచుకుపడ్డారు. సీట్ల పంపకాల్లో కాంగ్రెస్ ఠాక్రేని ఒత్తిడి చేసింది, తమతో ఉన్న సమయంలో ఉద్ధవ్ ఠాక్రేకి ఎక్కువ సీట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
C Voter Survey Maharashtra: మహారాష్ట్ర ఎన్నికలపై దేశవ్యాప్తంగా అందరి ఆసక్తి నెలకొంది. హర్యానాలో ఘన విజయం సాధించిన బీజేపీ, మరోసారి మహారాష్ట్రలో కూటమిగా అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార ‘మహాయుతి’ కూటమి( బీజేపీ-ఎన్సీపీ అజిత్ పవార్- శివసేన ఏక్‌నాథ్ షిండే), మరోవైపు ‘మహా వికాస్ అఘాడీ’( కాంగ్రెస్-ఎన్సీపీ శరద్ పవార్- శివసేన ఉద్ధవ్ ఠాక్రే) కూటమి పోటీ పడుతున్నాయి. ఈ రెండు కూటముల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.