కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, కొత్త హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో నటించారు.. ఏప్రిల్ నెలలో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది.. ఓ మాదిరి టాక్ ను అందుకుంది.. ఇప్పుడు ఓటీటీ లోకి రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది…
సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా కావడంతో ఓ మాదిరిగా హిట్ టాక్ ను అందుకుంది.. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో ఈ లవ్ స్టోరీ స్ట్రీమింగ్ కానుంది.. ఈ మూవీ పోస్టర్‌ను తమ ట్విట్టర్ లో షేర్ చేసింది ఆహా ఓటీటీ. త్వరలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించింది.. ఈ మూవీ థియేటర్లలో పర్వాలేదనే టాక్ ను అందుకుంది.. మరి ఇక్కడ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..
ఈ సినిమా కథ విషయానికొస్తే.. పార్వతీశం సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. సొంతకాళ్లపై ఇండిపెండెంట్‌గా బతికే అమ్మాయి తనకు భార్యగా రావాలని కలలు కంటాడు. హీరో తండ్రీ బాగా కట్నం తెచ్చే అమ్మాయితో పెళ్లి చెయ్యాలని చూస్తాడు.. హీరో ఓ రోజు కూరగాయల మార్కెట్‌లో మహాలక్ష్మి కనబడుతుంది. కూరగాయలు అమ్ముతూ తన కుటుంబాన్ని పోషించుకుకుంటుంది మహాలక్ష్మి. ఆమె తెగువ, ఆలోచనావిధానం నచ్చి తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు.. కానీ తను హీరోను రిజెక్ట్ చేస్తుంది.. చివరికి వీరిద్దరి ప్రేమ, పెళ్లి ఎలా జరుగుతుంది అనేది ఈ సినిమా కథ.. పెళ్లి విషయంలో యువతరం ఆలోచనలు ఎలా ఉంటున్నాయనే పాయింట్‌తో దర్శకుడు వీఎస్ ముఖేష్ ఈ మూవీని తెరకెక్కించాడు.. ఆడపిల్లలు ఎలా ఉండాలి అనేది చూపించాడు..