Sharad Pawar: లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన (యూబీటీ)తో కలిసి పోరాడిన శరద్ పవార్ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన వైఖరిని ప్రదర్శించింది. పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువ స్థానాల్లోనే పోటీ చేశాం.. కానీ, అసెంబ్లీలో మాత్రం మా పార్టీ రాజీపడదని శివసేన, కాంగ్రెస్ పార్టీలకు స్పష్టం చేశారు.