దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా రికార్డ్‌ల వర్షం కురిపిస్తోంది. ఇప్పిటికే RRR నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ స్కోర్ చేయడంతో భారతీయ ప్రేక్షకులను గర్వించేలా చేసింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల నటనకు ప్రపంచ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. RRR జపాన్‌లో అనేక రికార్డులను చెరిపివేసింది మరియు అక్కడ అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా అందరికీ తెలుసు. అయితే.. ఈ సినిమా ఇప్పుడు 1 బిలియన్ జపనీస్ యెన్ మార్కును దాటింది. ఇది భారతీయ రూపాయలలో సుమారు 63 కోట్లు, ఇది ఒక చారిత్రాత్మక ఫీట్. ఈ లేటెస్ట్ న్యూస్‌తో తారక్, చరణ్‌ల అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఆస్కార్‌పైనే ఉంది, దీని ఫలితాలు మార్చి 12న ప్రకటించబడతాయి. నాటు నాటు ప్రతిష్టాత్మకమైన అకాడమీ అవార్డును సాధించాలని ఆశిద్దాం.
Also Read : Taraka Ratna: అలా కోదండ రామిరెడ్డి చేతికి వెళ్లిన ‘ఒకటో నెంబర్ కుర్రాడు’
అయితే ఇదిలా ఉంటే.. తాజాగా, మరో రెండు విదేశీ అవార్డులు కూడా ఆర్ఆర్ఆర్ ను వరించాయి. హూస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ ఉత్తమ విదేశీ చిత్రంగా నిలిచింది. అంతేకాదు, ఈ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ పురస్కారం కూడా ఈ చిత్రానికే దక్కింది. ఇప్పటికే ఆస్కార్ బరిలో ఉన్న నాటు నాటు పాట హూస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీని కూడా ఆకట్టుకుంది.
Also Read : Electric Shock: క్రికెట్ ఆడుతూ బాల్ కోసం వెళ్లిన బాలుడు….