ఒక్కోసారి ప్రమాదాలు వెంటాడుతూ ఉంటాయి. సరదాగా క్రికెట్ ఆడుతూ పక్క ఇంట్లో పడ్డ బాల్ కోసం వెళ్ళిన బాలుడు విద్యుత్ షాక్ కి గురయ్యాడు. వెంటనే తిరిగి రాని లోకాలకు చేరాడు. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన ముద్ధం ఈశ్వర్ 11 సంవత్సరాల బాలుడు విద్యానగర్లో క్రికెట్ ఆడుతున్నాడు.
బ్యాటింగ్ చేస్తుండగా పక్కింట్లో పడ్డ బాల్ తీసుకురావడానికి వెళ్ళాడు. అయితే, అక్కడే మృత్యుదేవత పొంచి ఉందని కనుక్కోలేక పోయాడు. ఆ ఇంటి తోటలో కోతుల బెడద ఉండంతో వాటి నుంచి రక్షణకు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి బాలుడు మృతి చెందాడు. ఇంట్లో తోటకు విద్యుత్ వైర్లు పెట్టి నిర్లక్ష్యంగా నిండు ప్రాణాన్ని బలిగొన్న వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాలుని కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ సిఐ అజయ్ బాబు ఎస్ఐ శంకర్ ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. ఆదివారం సెలవు రోజున ఈ విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబం శోకసంద్రమయింది.
ప్రేమజంట బలవన్మరణం
ప్రేమించుకున్నామని చెబుతారు.. పెద్దలు కాదంటే తమకు ఈ జీవితం వద్దని బలవన్మరణానికి పాల్పడుతుంటారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దొనబండ గ్రామానికి చెందిన ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. 8 ఏళ్లు గా ప్రేమించు కుంటున్నారు దొనబంద గ్రామానికి చెందిన శ్రీకాంత్, సంఘవి. పెళ్లికి ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకరించినప్పటికీ శ్రీకాంత్ కు ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెంది పురుగుల మందు సేవించడంతో తను లేని జీవితం నాకెందుకు అంటూ సంఘవి కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. చికిత్స పొందుతూ ప్రేమికులు మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు హాజీపూర్ పోలీసులు.
Read Also: Snake At Shiva Temple: ఒకవైపు శివ కల్యాణం.. మరోవైపు నాగపాము దర్శనం