Taraka Ratna: తారకరత్న మృతితో సినీ ఇండస్ట్రీతో పాటు నందమూరి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. బెంగుళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు. అయితే తారకరత్న సినిమాలని, ఆయన జ్ఞాపకాలని వారి అభిమానులు ఎప్పటికీ నెమరవేసుకుంటూనే ఉంటారు. తారకరత్న ఇండస్ట్రీలోకి ఒక ఉప్పెనలా అడుగుపెట్టారు. అప్పటి వరకు ఏ హీరోకు సాధ్యం కాని రికార్డుతో నందమూరి వారసుడు ఎంట్రీ ఇచ్చాడు. ఆయన తొలి చిత్రం గురించే అప్పటి ఉమ్మడి రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంది. బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యుల నుంచి తారకరత్నకు మద్దతు లభించింది. అయితే తారకరత్న తొలి చిత్రం ఒకటో నెంబర్ కుర్రాడు విషయంలో పెద్ద కసరత్తు జరిగిందని సమాచారం. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకు 100వ సినిమా సమయంలో పెద్ద తలనొప్పే ఎదురైంది.. ఆ సమయంలో తన 100వ చిత్రానికి సన్నాహకాలు చేసుకుంటున్నారు రాఘవేంద్రరావు.
Read Also: Taraka Ratna Wife: తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి అస్వస్థత
ఇండస్ట్రీలోని టాప్ హీరోతో 100వ చిత్రం చేయాలనేది ఆయన కోరిక. కానీ అదే సమయంలో తారకరత్న తండ్రి నందమూరి మోహనకృష్ణ రాఘవేంద్రరావును తన కొడుకు తారకరత్నను లాంచ్ చేయమని అడిగారు. అదే సమయంలో అల్లు అరవింద్ కూడా అల్లు అర్జున్ ని లాంచ్ చేయమని రిక్వెస్ట్ చేశారు. వీరి ఎంట్రీ గురించి చాలా రోజులు అప్పట్లో చర్చలు కొనసాగాయి. కొంతకాలం ఎటూ తేల్చుకోలేని సిట్యువేషన్ లో రాఘవేంద్ర రావు కొట్టుమిట్టాడారు. కానీ లాస్ట్ కు అల్లు అర్జున్ చిత్రానికే ఒకే చెప్పారు. రాఘవేంద్రరావు చేసిన దానికి మోహనకృష్ణ నొచ్చుకోకుండా.. తారకరత్న చిత్రానికి నేను సపోర్ట్ చేస్తా. మీ కొడుకుని తగ్గ కథని ప్రిపేర్ చేయిస్తా, సమర్పకుడిగా కూడా ఉంటా. దర్శకుడిని మాత్రం మీరు తెచ్చుకోండి అని మోహనకృష్ణకు రాఘవేంద్రరావు చెప్పారు. దీనితో మోహనకృష్ణ తన సోదరుడు బాలయ్యని సలహా అడిగారట. బి గోపాల్, సింగీతం శ్రీనివాసరావు లలో ఒకరిని ఎంచుకోవాలని సూచించారు. కానీ ఆ ఇద్దరు దర్శకులు వివిధ కారణాలు చెప్పి నో అన్నారు. దీనితో తిరిగి రాఘవేంద్ర రావుని సలహా అడగగా కోదండరామిరెడ్డిని సూచించారు. అలా ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రం కోదండరామిరెడ్డి చేతికి వచ్చింది.
Read Also: Tarakaratna Daughter: బాలయ్యను చూసి పరిగెత్తుకెళ్లి హత్తుకున్న తారకరత్న కూతురు