Janasena: నేడు భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం మంగళగిరి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం 10 గంటలకు భీమవరం చేరుకోనున్నారు. అక్కడ తొలుత తోట సీతారామలక్ష్మీతో ఆయన సమావేశం కానున్నారు. మర్యాదపూర్వకంగానే ఆమెను కలుసుకుని ప్రస్తుత రాజకీయాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను కూడా పవన్ కలవనున్నారు. వీరిద్దరితో మర్యాదపూర్వకంగానే జనసేనాని భేటీ అవుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Read Also: Paytm : పేటీఎంకు షాక్.. కంపెనీ సీనియర్ అధికారి ఇంటిపై సీబీఐ దాడులు
ఇక, ఆ తర్వాత జనసేన పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ- జనసేన పొత్తుతో పోటీ చేయాల్సిన స్థానాలు, ఎక్కడ నుంచి పోటీ చేయాలి? ఎక్కడ జనసేన బలంగా ఉంది? అభ్యర్థులు బలంగా ఎక్కడ ఉన్నారు? అనే దానిపై నేతలతో ఆయన చర్చించనున్నారు. అయితే, ఈ సమావేశంలో ఎక్కడి నుంచి పోటీ చేసేది తెలియజేయకున్నా నేతల నుంచి పవన్ కొంత ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని తెలుస్తుంది.
Read Also: KL Rahul: నాలుగో టెస్టుకూ కేఎల్ రాహుల్ దూరం.. జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి!
కాగా, భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ ఫొటీ చేయాలని నియోజకవర్గ ప్రజలు పార్టీ నేతలు కోరుతున్నారు. పవన్ కల్యాణ్ నాన్ లోకల్ కాదు పక్కా లోకల్.. చంద్రబాబు, జగన్ మాదిరిగానే పవన్ కళ్యాణ్ కూడా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులు అని జనసేన నేతలు తెలియజేస్తున్నారు. ఇక, భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి.. ఆయన నివాసం ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశామని భీమవరం జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి వెల్లడించారు. వాస్తవానికి.. ఈ నెల 14వ తేదీన భీమవరంలో పవన్ పర్యటించాల్సి ఉండగా.. హెలిప్యాడ్ కు అధికారులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో తన పర్యటనను వాయిదా వేసుకుని.. ఇవాళ భీమవరంలో పర్యటిస్తున్నారు.