Cyber Crime: పశ్చిమ గోదావరి జిల్లాలో సైబర్ నేరాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు దోచుకున్న గ్యాంగ్‌ను భీమవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని పలు ప్రాంతాలకు చెందిన ఐదుగురు సభ్యుల ఈ ముఠా, ఆధునిక సైబర్ ట్రిక్స్‌తో ప్రజలను మోసగిస్తూ భారీ మొత్తంలో డబ్బును దోచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.
Bhimavaram Double Murder: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. మన్నా చర్చ్ ఎదురుగా ఉండే ఇంటిలో తల్లిని, తమ్ముడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు దాడి చేశాడు గునుపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి.. ఈ ఘటనలో తల్లి గునుపూడి మహాలక్ష్మి, రవితేజ అక్కడికక్కడే మృతి చెందారు. తల్లిని తమ్ముడిని హత్య చేసిన అనంతరం నిందితుడు 112 కాల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించడం. ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి ఆధ్వర్యంలో…
Off The Record: భీమవరం అసెంబ్లీ సెగ్మెంట్….. 2019లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు దారణమైన అనుభవాన్ని మిగిల్చిన నియోజకవర్గం. అదే చోట ఈసారి… 2024లో పార్టీ అభ్యర్థి గెలిచినా… ఆ ఆనందం రోజురోజుకీ ఆవిరి అయిపోతోందట. 2024లో నేను ఎక్కడ పోటీ చేసినా…. భీమవరాన్ని మాత్రం మర్చిపోను .. అభివృద్ధి చేసి చూపిస్తానని అప్పట్లో పవన్ ఇచ్చిన హామీలకు దిక్కు లేకుండా పోతోందని అంటున్నారు. అధినేత ఆశయాలను,ఇచ్చిన మాటను పక్కన పెడుతున్న భీమవరం జనసేన నేతలు… సంపాదన మీదే శ్రద్ధ…
Off The Record: ఏపీలో ఒకపక్క జోరుగా వర్షాలు పడుతుంటే…. మరోవైపు పొలిటికల్ హీట్ మాత్రం పొగలు పుట్టిస్తోంది. అందులోనూ… పై స్థాయిలో కూటమి పార్టీల మధ్య కుమ్ములాటలు పైకి కనిపించకున్నా… లోలోపల కుళ్ళబొడిచేసుకుంటున్నట్టు అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. ప్రత్యేకించి ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనల్నే ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. అందులోనూ… భీమవరం డీఎస్పీ వ్యవహారాన్ని బాగా హైలైట్ చేసి చూపిస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులు. డీఎస్పీ జయసూర్య తీరును తీవ్రంగా తప్పుపట్టారు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్.…
భీమవరం డీఎస్పీ వ్యవహారశైలిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యారు? ఒక డివిజన్ అధికారి గురించి డిప్యూటీ సీఎం స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇది కేవలం ఒక ఆఫీసర్‌కి సంబంధించిన వ్యవహారమేనా? లేక అంతకు మించి కూటమి పార్టీల మధ్య కుమ్ములాటల పర్యవసానమా? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కూటమి మూడు పార్టీల నేతల మధ్య కోల్డ్ వార్ కంటిన్యూ అవుతున్నట్టుగా…
జిల్లాల పునర్విభజన తర్వాత భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లా ఏర్పాటైంది. పాలనకు అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులో లేకపోవడంతో భీమవరం సమీపంలోని ప్రైవేటు కార్యాలయంలో కలెక్టరేట్ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు.. ప్రస్తుతం ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న కలెక్టరేట్ కోసం 20 ఎకరాల భూమి, 100 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.
పవన్ ఏదో చేస్తారని పిఠాపురం ప్రజలు ఆశపడ్డారు.. కానీ, ఏడాది గడిచినా పిఠాపురంలో అభివృద్ధి సున్నా అని ఎద్దేవా చేశారు. పవన్ సీఎం అవుతానని చెప్పి.. మరొకరిని ముఖ్యమంత్రిని చేశారని తెలిపారు. ఇక, రాజకీయంగా జన్మనిచ్చిన పిఠాపురంలో పవన్ అంతం అయ్యేలా వచ్చే ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలని జక్కంపూడి రాజా కోరారు.
Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. విష్ణు, మోహన్ బాబు వరుసగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ మూవీపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర భాషల్లో కూడా ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారు. మూవీని జూన్ 27న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారంట. ఏపీలోని భీమవరంలో ఈవెంట్ చేస్తారని టాక్. దీనికి ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్టు…
సంక్రాంతి టైంలో... గోదావరి జిల్లాల్లో... కోడి పందేలు ఎంత ఫేమస్సో... పేకాట శిబిరాలు కూడా అంతే పాపులర్. ఆ మూడు రోజులు కూర్చున్న దగ్గర్నుంచి లేవకుండా ఆడే పేకాట రాయుళ్ళు ఉంటారంటే అతిశయోక్తి కాదు. దాన్ని సరదా అని వాళ్ళంటారు. జూదమని బయటి వాళ్లంటారు. సరే... ఎవరేమనుకున్నా... అదంతా అంతవరకే. పండగ ముచ్చట ముగిశాక అలాంటివి ఉండవు కాబట్టి పోలీసులు కూడా చూసీ చూడనట్టు వదిలేస్తారు. కానీ... ఇప్పుడు పరిస్థితి మారుతోందట.