KL Rahul ruled out and Jasprit Bumrah Rested in Ranchi Test: టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్టుకూ దూరమయ్యాడు. గాయం కారణంగా ఫ్రిబ్రవరి 23 నుంచి ఆరంభం అయ్యే రాంచీ టెస్టుకు దూరమయ్యాడు. పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో రాహుల్ తప్పుకున్నాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఫిట్‌నెస్ సాధిస్తే చివరి టెస్టుకు అందుబాటులోకి వస్తాడని స్పష్టం చేసింది. తొడ కండరాల గాయం కారణంగా రాహుల్ గత రెండు టెస్టులు (విశాఖ, రాజ్‌కోట్) ఆడని విషయం తెలిసిందే.
మరోవైపు పని భారం కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు నాలుగో మ్యాచ్ నుంచి విశ్రాంతినిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. బుమ్రా స్థానంలో రాజ్‌కోట్ టెస్టు ఆడని ముకేశ్ కుమార్ నాలుగో టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. బుమ్రాకు విశ్రాంతి ముందే ఊహించిందే. మొదటి మూడు టెస్టుల్లో 80.5 ఓవర్లు బౌలింగ్ చేశాడు. రెండు, మూడు టెస్టులో భారత్ విజయాల్లో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. మొహమ్మద్ సిరాజ్ పేస్ దళంను నడిపించనున్నాడు. ఈ నెల 23 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య రాంచీలో నాలుగో టెస్టు మ్యాచ్ జరుగనుంది.
Also Read: Vasanthi Krishnan Marriage: పవన్ కల్యాణ్‌ను పెళ్లి చేసుకున్న బిగ్‍బాస్ వాసంతి!
‘ఎల్ రాహుల్ నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. ఫిట్‌గా ఉంటే చివరి టెస్టులో ఆడతాడు. జస్ప్రీత్ బుమ్రాను జట్టు నుంచి విడుదల చేశారు. నాలుగో టెస్టులో అతడు ఆడడు. టెస్టు సిరీస్ వ్యవధి, ఇటీవల కాలంలో అతడి పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.