జనసేన అధినే పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్ లో స్పల్ప మార్పులు జరిగాయి. ఇవాళ సాయంత్రం ఆరు గంటల వరకు జనసేనాని విశాఖలోనే ఉండనున్నారు. అలాగే, నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేయనున్నారు. ఇక, ఆశావహులు కు వన్ టు వన్ ఇంటర్వ్యూలో అధ్యక్షుడు క్లారిటీ ఇస్తున్నారు. కాగా, పొత్తుల కారణంగా ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవచ్చు అని వారికి తెలియజేస్తున్నారు. ఎక్కువ మందికి అవకాశం వస్తుంది.. ఎవ్వరూ కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు అని పవన్ కళ్యాణ్ తెలియజేస్తున్నారు. అయితే, ఎన్నికల తర్వాత అందరికీ సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇప్పటికే పార్టీలోని ముఖ్య నేతలను ఆయన భేటీ అవుతున్నారు.
Read Also: Coconut Milk Benefits : కొబ్బరి పాల వల్ల కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..
అలాగే, ఇవాళ రాజమండ్రి రూరల్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. జనసేన పార్లమెంటరీ కార్యాలయంలో పవన్ ఎన్నికల సమావేశంలో పాల్గొంటారు. నియోజకవర్గ ఇంఛార్జులు, ముఖ్య నాయకులతో ఆయన భేటీ కానున్నారు. అయితే, భారీ ర్యాలీతో పార్టీ అధినేత పవన్ కు స్వాగతం పలికేందుకు నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, రాజమండ్రి రూరల్ టికెట్ పై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే, రాజమండ్రి రూరల్ టికెట్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి రాదని.. జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ కు వస్తుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.