కొబ్బరి బొండం తాగుతారు.. కొందరు అందులోని కొబ్బరిని కూడా తింటారు.. కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.. అలాగే కొబ్బరి పాలను కూడా ఎక్కువగా వాడుతారు.. బిరియాని, మసాలా కూరల్లో వీటిని ఎక్కువగా వాడుతారు.. అయితే ఈ పాలను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
కొబ్బరి పాలను తీసుకోవడం వల్ల ముఖంపై మొటిమలు మచ్చలు వంటి అందానికి సంబంధించిన సమస్యలు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. కాగా మొటిమలు మచ్చలు వంటి సమస్యలతో బాధపడేవారు, నీటిలో కొద్దిగా రోజు వాటర్ కొబ్బరి పాలు కలిపి మిశ్రమాన్ని స్నానానికి వాడితే మంచిది.. రోజుకొక కప్పు కొబ్బరి పాలను తీసుకుంటే రక్తహీనత తొలగిపోతుంది. అలాగే ఇది వెంట్రుకలు రాలకుండా సహాయపడుతుంది.. అంతేకాదు బరువును తగ్గించడంలో మేలు చేస్తుంది..
రోజూ ఉదయం ఒకగ్లాస్ తాగడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన ఉంటుంది.. దాంతో ఎక్కువగా తినరు.. సులువుగా బరువు తగ్గవచ్చు.. యాంటీ మైక్రోబెల్, యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు కొబ్బరిపాలలో సమృద్ధిగా ఉన్నాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి… రక్తంలో చక్కెర నిల్వలు తక్కువగా ఉన్న వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆర్థరైటిస్ కు చక్కని మందుగా పని చేస్తాయి.. చర్మానికి కొబ్బరి పాలు సాహసిద్ధంగా మాయిశ్చరైసర్ గా క్లీనర్ గా కూడా పనిచేస్తుంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.