కర్నాటక తీర్పు గెలుపెవరిదో? అన్ని పార్టీల్లో ఉత్కంఠ
కర్ణాటక రాష్ట్రాన్ని మరో ఐదేళ్ల పాటు పాలించేదెవరో అనే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. గత ఎన్నికల్లో ఏ పార్టీని పూర్తిగా విశ్వసించని కన్నడ ప్రజలు ఈ సారి మరో ఐదేళ్లకు ఎవరి చేతిలో పగ్గాలు పెడతారో నేడు తెలుస్తుంది. వచ్చే ఏటా నిర్వహించే లోక్‌సభ ఎన్నికలకు కర్ణాటక ఫలితాలు ఎంతో కీలకమని విశ్లేషణలు ఊపందుకున్న సమయంలో ఫలితం కోసం దేశవ్యాప్త రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. మొత్తం 2,615 మంది భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 8 గంటలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) తెరపై ఎన్నికల ఫలితం కనిపించడం ప్రారంభం కానుంది. కర్ణాటక ఈ సారైనా స్థిరమైన ప్రభుత్వానికి దారులు వేస్తుందా అనేది వేచి చూడాల్సిందే.ఎన్నికల కౌంటింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. తుది ఫలితాలపై మధ్యాహ్నం వరకు ఓ స్పష్టమైన అవగాహన వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 73.19 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కొన్ని సర్వేలు బీజేపీ మళ్లీ గెలుస్తుందని తెలియజేశాయి. స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ నెగ్గే అవకాశం ఉన్నట్లు మరికొన్ని సర్వేల్లో వెల్లడయ్యింది. జేడీ(ఎస్) కింగ్‌మేకర్ మారే అవకాశాలు కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటకలో గత 38 ఏళ్లుగా అధికార పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు.
బంగ్లాదేశ్‌ను సమీపిస్తున్న మోచా తుఫాను
బంగాళాఖాతం నుంచి బంగ్లాదేశ్ తీరానికి చేరుకునే అతి తీవ్రమైన తుఫాను ‘మోచా’తో దేశంలోని తీర ప్రాంతాలు, ఓడరేవులలో ఆందోళనలు పెరుగుతున్నాయి. మూడు ఓడరేవులు, 12 జిల్లాలకు భారీ ప్రమాదం ఉందని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రమాద హెచ్చరిక నం.8ను దేశ వాతావరణ కార్యాలయం జారీ చేసింది. మూడు పోర్టులతో పాటు చటోగ్రామ్, కాక్స్ బజార్, పేరా. కాక్స్ బజార్, చటోగ్రామ్, ఫెని, నోఖాలి, లక్ష్మీపూర్, చాంద్‌పూర్, బరిషల్, భోలా, పటువాఖలి, ఝలకతి, పిరోజ్‌పూర్, బర్గునా జిల్లాలు కూడా గ్రేట్ డేంజర్ సిగ్నల్ నెం.8 కిందకు వస్తాయి. మోంగ్లా ఓడరేవు కూడా శుక్రవారం మధ్యాహ్నం నుండి స్థానిక హెచ్చరిక సిగ్నల్ నెం.4ను ప్రదర్శించాలని కోరింది. తుఫాను కేంద్రానికి 74 కిలోమీటర్ల పరిధిలో గరిష్టంగా గాలి వేగం గంటకు 140 కిలోమీటర్లు, గంటకు 160 కిలోమీటర్లకు పెరుగుతుందని బంగ్లాదేశ్ వాతావరణ శాఖ శుక్రవారం రాత్రి ప్రత్యేక బులెటిన్‌లో తెలిపింది.కాక్స్ బజార్ వాతావరణ కార్యాలయ ఇన్‌ఛార్జ్ డాక్టర్ తంజీర్ సైఫ్ అహ్మద్ ఈ సమాచారాన్ని ధృవీకరించారు. తుఫాను మోంగ్లా పోర్ట్ నుంచి 965 కిమీ, చిట్టగాంగ్ నుంచి 1,005 కిమీ, కాక్స్ బజార్ నుంచి 935 కిమీ, పేరా సీ పోర్ట్ నుంచి 930 కిమీ దూరంలో ఉందని చెప్పారు. ఇది మరింత బలపడి ఆదివారం తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను పరిధీయ ప్రభావంతో చటోగ్రామ్, కాక్స్ బజార్ సాధారణ స్థాయి కంటే 8-12 అడుగుల ఎత్తులో గాలితో నడిచే తుఫానును ఎదుర్కోవచ్చని వాతావరణ కార్యాలయం తెలిపింది. పెను ప్రమాద సంకేతం ఉన్న ఇతర జిల్లాల్లో తుపాను సాధారణ స్థాయి కంటే 5-7 అడుగుల ఎత్తులో ఉండే అవకాశం ఉంది. తదుపరి నోటీసు వచ్చేవరకు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
స్వచ్చ తిరుమల-శుద్ధ తిరుమలలో పాల్గొనడం నా అదృష్టం
తిరుమల పవిత్రతకు, పరిశుభ్రతకు టీటీడీ ప్రాధాన్యత నిస్తోంది. అందులో భాగంగా ఇవాళ్టి నుంచి స్వచ్ఛ తిరుమల-శుద్ద తిరుమల కార్యక్రమం నిర్వహిస్తోంది. అలిపిరి వద్ద జెండా ఊపి స్వచ్చ తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. స్వచ్ఛ తిరుమల-శుద్ద తిరుమల కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టం అన్నారు మాజీ సిజేఐ జస్టిస్ ఎన్వీ రమణ,ఇఓ ధర్మారెడ్డి. తిరుమల కొండల పరిశుభ్రంగా వుంచవలసిన బాధ్యత అందరి పైన వుంది. తిరుమల కొండలు ప్లాస్టిక్,వ్యర్ద రహిత ప్రాంతంగా వుంచడానికి కార్యక్రమాన్ని ప్రారంభించాం అన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. మొదటి ఘాట్ రోడ్డు ఏడవ మైలు వద్ద స్వయంగా పాల్గొన్నారు జస్టిస్ ఎన్వీ రమణ. రెండు ఘాట్ రోడ్డులు, రెండు నడకమార్గాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. భక్తులకు ప్లాస్టిక్ వ్యర్దాలను బయట ప్రాంతాలలో వెయ్యకుండా టీటీడీ సహకరించాలన్నారు. తిరుమలను రోజూ లక్షమంది వరకూ భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తులు వాడే వివిధ ప్లాస్టిక్ వస్తువుల వల్ల తిరుమలలో స్వచ్ఛత ప్రశ్నార్థకంగా మారుతున్న వేళ ఇటీవల టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల కొండపై ఎవరూ ప్లాస్టిక్ కవర్లు వినియోగించరాదు, షాపుల యజమానులు కవర్లలో పెట్టి వస్తువులు అందించకూడదని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, అతిక్రమిస్తే 25 వేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు.తిరుమలకు వచ్చే భక్తులు కూడా ఈ నిబంధన కచ్చితంగా అమలు చేసేలా వారిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్వహిస్తున్నారు.
కూతుర్ని వదిలేశాడు.. అత్త కత్తిలా ఉందని కన్నేశాడు
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. భార్యను అల్లుడుతో ఆ స్థితిలో చూసి ఆగ్రహించిన భర్త హతమార్చిన ఘటన చోటుచేసుకుంది. భార్యను చంపిన అనంతరం అల్లుడుపై కూడా నిందితుడు దాడికి పాల్పడ్డాడు. అయితే అతడు తృటిలో గాయాలతో తప్పించుకున్నాడు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనానంతరం నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అతడిని పట్టుకున్నారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల పోలీసు కస్టడీకి పంపారు. అరెస్టయిన నిందితుడి పేరు చందన్ మెష్రామ్. వివరాల్లోకి వెళితే.. చందన్ మెష్రామ్‌కు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు మొత్తం ఐదుగురు పిల్లలు ఉన్నారు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతని పెద్ద కుమార్తె జునాపరాకు చెందిన సంజుతో వివాహం జరిగింది. కూతురి పెళ్లి తర్వాత అత్తగారు అమ్రికిబాయి, అల్లుడు సంజుల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. కాగా, చందన్ బుధవారం మధ్యాహ్నం తన పొలానికి చేరుకున్నాడు. అక్కడ అతని భార్య తన అల్లుడు సంజుతో అసహ్యకరమైన స్థితిలో ఉంది. ఇది చూసి సహనం కోల్పోయి పక్కనే ఉన్న గొడ్డలి తీసుకుని ఇద్దరిపై దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, సంజు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని తీసుకుని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన సంజు ఆసుపత్రిలో చేరాడు.
చార్జింగ్ తీయకుండా ఫోన్ మాట్లాడాడు.. ప్రాణాలు కోల్పోయాడు
చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతోన్న సమయంలో.. తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. చార్జింగ్ పెట్టిన ఫోన్ పేలి కొన్ని ప్రమాదాలు జరిగితే.. మరికొన్ని మాత్రం నిర్లక్ష్యంగా.. చార్జింగ్ పెట్టి ఉండగానే ఫోన్ మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.. తాజాగా, అనకాపల్లి నర్సీపట్నంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.. నర్సీపట్నం మున్సిపాలిటీ కోమటి వీధిలో రాత్రి 7:30 గంటల సమయంలో క్యాటరింగ్ బాయ్ గా పని చేస్తున్న కోమాకుల లక్ష్మణ్ అనే 25 ఏళ్ల యువకుడు తన మొబైల్‌కు చార్జింగ్ పెట్టాడు. అయితే, ఆ సమయంలో తనకు ఫోన్ రాగా పవర్ ఆఫ్ చేయకుండా చార్జింగ్ లో ఉన్న మొబైల్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు.. ఇదే సమయంలో చార్జర్ షార్ట్ సర్క్యూట్ కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా ప్రాణాలు దక్కలేదు.. ఆస్పత్రికి వెళ్లే మార్గం మధ్యలోనే మృతి చెందాడు.. ఇక, ఈ ఘటనపై మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో (సెక్షన్ 174) అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు..
ఒక్క చెట్టుకు 300రకాల మామిడి పండ్లా.. ఎక్కడ?
వేసవి వచ్చిందంటే చాటు మామిడి పండ్లు మార్కెట్లోకి వస్తాయి. ప్రతి ఒక్కరు వాటిని తినేందుకు ఆసక్తి కనబరుస్తారు. బంగినపల్లి, తోతాపురి, రసాలు ఇలా మామిడిలో చాలా రకాలున్నాయి. కానీ ఇవన్నీ వేరు వేరు చెట్లకు కాస్తాయి. కానీ ఒకే చెట్టుకు 300రకాలమామిడి పండ్లు పండితే ఎలా ఉంటుంది.. కోరుకున్న పండును కావలిన టైంలో తినేయవచ్చు కదా.. ఆ ఊహే ఎలా ఉంది.. బాగుంది కదా.. ఈ చెట్టు ఎక్కడుంది దాని ప్రత్యేకత తెలుకుందాం. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. లక్నో నగరంలో ప్రత్యేకంగా మాట్లాడుకునే మామిడి చెట్టు ఉంది. ఈ మామిడి చెట్టు ప్రత్యేకత ఏమిటంటే ఈ ఒక్క చెట్టుపైనే దాదాపు 300 రకాల మామిడి పండ్లు పండుతాయి. ఈ చెట్టు లక్నోకు కొన్ని కిలోమీటర్ల దూరంలో మలిహాబాద్ చౌక్ సమీపంలో ఉంది.లక్నో నగరానికి చెందిన హాజీ కలీమ్ ఉల్లాఖాన్ అనే వ్యక్తి ఎంతో శ్రమతో ఒక చెట్టును కనుగొన్నాడు, ఇది చూపరులను ఆశ్చర్యపరిచింది. గ్రాఫ్టింగ్ టెక్నాలజీని ఉపయోగించి, అతను 300 రకాల మామిడిని పండించే చెట్టును కనుగొన్నాడు. ఈ చెట్టు రహస్యాన్ని తెలుసుకునేందుకు జపాన్ నుంచి వచ్చిన బృందం కూడా ఇక్కడికి వచ్చింది. ఈ విశిష్ట పనికి గాను హాజీ కలీమ్‌ను అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు.
గుజరాత్ టైటాన్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం
మే 12వ తేదీన వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓడిపోయింది. ముంబై నిర్దేశించిన 219 పరుగుల లక్ష్యాన్ని ఛేధించలేకపోయింది. 20 ఓవర్లలో 191 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో.. 27 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. నిజానికి.. 108 పరుగులకే జీటీ 8 వికెట్లు కోల్పోవడంతో, భారీ తేడాతో ముంబై విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ, రషీద్ ఖాన్ ముంబై ఆశలపై నీళ్లు చల్లేశాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన అతగాడు.. ఊచకోత కోశాడు. ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. 32 బంతుల్లోనే 3 ఫోర్లు 10 సిక్సులతో 79 పరుగులు చేశాడు. అల్జారి జోసెఫ్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కి 88 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. తన జట్టుని ఆలౌట్ కానివ్వకుండా, చివరివరకు క్రీజులో నిలబడి, ఒంటరి పోరాటం కొనసాగించాడు. అతడు పోరాడిన తీరుకి.. ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే!