సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్ లింక్ ఇదే..
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) శుక్రవారం 12వ తరగతి బోర్డు పరీక్ష ఫలితాలను ప్రకటించింది. ఈ విషయాన్ని బోర్డు తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ప్రకటించింది. దేశవ్యాప్తంగా దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు ఆసక్తితో ఎదురుచూస్తోన్న CBSE 12వ తరగతి ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు https://www.cbse.gov.in/ లేదా https://results.cbse.nic.in/ వెబ్‌సైట్‌ల ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాలను చెక్ చేసుకునే సమయంలో అడ్మిట్‌కార్డు, రిజిస్ట్రేషన్ వివరాలను అందుబాటులో ఉంచుకోవాలి. సీబీఎస్‌ఈ ప్రకారం, ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 87.33 శాతంగా నమోదైంది. దీంతో 2019లో వచ్చిన 83.40 శాతం ఉత్తీర్ణతను అధిగమించినట్లు అయింది. మొత్తం ఉత్తీర్ణత శాతం 87.33 శాతం కాగా.. త్రివేండ్రం ప్రాంతం 99.91 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో ఉంది. 78.05 శాతంతో ప్రయాగ్‌రాజ్ జాబితాలో చివరి స్థానంలో ఉంది. బాలికలు 90.68 ఉత్తీర్ణతతో 6.01శాతం మంది బాలుర కంటే మెరుగ్గా ఉన్నారు.
ఫలితాలను ఎలా తెలుసుకోవాలంటే?
*విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లలో ఏదైనా ఒకదానికి లాగిన్ అవ్వాలి.
*తెరుచుకునే పేజీలో వారి రోల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ, పాఠశాల నంబర్‌ను నమోదు చేయమని అడుగుతుంది.
*సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత, ఫలితం ప్రకటించబడుతుంది.
*ప్రదర్శించబడిన ఫలితాన్ని విద్యార్థుల సౌలభ్యం కోసం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆనందనిలయం ఘటనలో భద్రతా వైఫల్యం
తిరుమలలో భద్రతా వైఫల్యం బయటపడడంతో టీటీడీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఆనంద నిలయంలో నిబంధనలకు విరుద్దంగా చిత్రీకరించిన వ్యక్తిని పోలిసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. భక్తుడు ఉధ్దేశపూర్వకంగానే ఆలయంలోకి మొభైట్ ఫోన్ తీసుకువెళ్ళినట్లుగా సిసి పుటేజి ద్వారా గుర్తించాం అన్నారు. భధ్రతాసిబ్బంది వైఫల్యం కారణంగానే ఘటన జరిగిందని భావిస్తున్నాం అన్నారు ధర్మారెడ్డి. విచారణ తరువాత బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అని ఈవో తెలిపారు. కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వ సహకారంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తాం అని స్పష్టం చేశారు.శ్రీవారి ఆనంద నిలయాన్ని రహస్యంగా చిత్రీకరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కరీంనగర్ కి చెందిన రాహుల్ రెడ్డి అనే వ్యక్తి మొబైల్ ఫోన్ తో ఆనంద నిలయ గోపురాన్ని చిత్రికరించినట్లు గుర్తించారు పోలీసులు. మొబైల్ ఫోన్ ని ఆలయంలోకి ఉద్దేశపూర్వకంగా రాహుల్ రెడ్డి తీసుకువెళ్ళినట్లు సిసి ఫుటేజి ద్వారా గుర్తించారు పోలీసులు.. నిందితుడి విజువల్స్ ని ఉద్దేశపూర్వకంగా వైరల్ చేసాడా ….లేక యాదృచ్చికంగా జరిగిందా అన్న దిశగా విచారణ చేస్తున్నారు పోలీసులు.
జీవీ ఫుట్ బాల్ యాప్ మోసాలపై పోలీసుల ఫోకస్
రోజురోజుకీ మోసగాళ్ళు ఎక్కువైపోతున్నారు. కడప జిల్లాలో సంచలనం రేపిన జీవి ఫుట్ బాల్ బెట్టింగ్ యాప్ మోసాలపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కడప వన్ టౌన్ పోలీసులు స్పెషల్ బ్రాంచ్ పోలీసుల సమాచారంతో సుమోటోగా కేసు నమోదు చేశారు. ఇప్పటిదాకా ఈ స్కేసులో 13 మంది నిర్వాహకులను అరెస్టు చేశారు. మరికొందరు నిర్వాహకులను సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా గుర్తించారు. ఈ యాప్ ద్వారా కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు పోలీసులు.బెట్టింగ్ యాప్ ద్వారా ప్రజలను జూదం లోకి దింపిన కీలక వ్యక్తుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.. సత్యసాయి పుట్టపర్తి జిల్లాకు చేసిన శిరీష అనే నిర్వాహకురాలికి కడప వన్ టౌన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. శిరీష ను విచారిస్తే జీవి బాల్ బెట్టింగ్ యాప్ మూలాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. పోలీసుల సుమోటో కేసుతో జివిపుట్ బాల్ బెట్టింగ్ యాప్ కార్యకలాపాలు స్తంభించాయి. దీంతో బెట్టింగ్ నిర్వాహకులు మూన్ పుట్ బాల్ యాప్ పేరుతో మరో కొత్త బెట్టింగ్ యాప్ ను తెరపైకి తెచ్చారు. ప్రజలు చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలనీ, ఈ యాప్ ల వల్ల నష్ట పోవద్దని వన్ టౌన్ సీఐ నాగరాజు విజ్ఞప్తి చేశారు.
డ్రోన్ల ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్..పంజాబ్ పోలీసుల అదుపులో నిందితులు
డ్రోన్లను ఉపయోగించి పాక్ నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ నుంచి డ్రగ్స్‌తో సంబంధం ఉన్న ముగ్గురు భారతీయులను ఢిల్లీ పోలీసుల కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ పట్టుకుంది. నిందితులు మల్కిత్ సింగ్, ధర్మేంద్ర సింగ్, హర్పాల్ సింగ్ పంజాబ్ నివాసితులు. ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ నుంచి కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ స్పెషల్ సెల్ వారిని అరెస్టు చేసింది. డ్రగ్స్ మాఫియా నుంచి పాకిస్థాన్‌కు హవాలా నెట్‌వర్క్ ద్వారా బదిలీ అయిన డబ్బుకు బదులుగా నిందితులు పాకిస్తాన్ నుంచి డ్రోన్‌ల ద్వారా పంజాబ్, ఇతర రాష్ట్రాలలో డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. పంజాబ్ నుంచి పరారైన ఈ ముగ్గురు డ్రగ్స్ సరఫరాదారులకు అమెరికా, ఫిలిప్పీన్స్‌లో సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లలో ఫిలిప్పీన్స్, అమెరికాకు చెందిన ఫోన్ నంబర్లు లభ్యమయ్యాయి. డ్రోన్‌ల ద్వారా పాకిస్తాన్ రవాణా చేసిన డ్రగ్స్‌ను ఎక్కడి నుంచి సేకరించాలో వారికి సూచించడానికి వారి హ్యాండ్లర్లు ఈ నంబర్‌లను ఉపయోగించారు. తరువాత అది పంజాబ్‌లోని వారి సరఫరాదారుకు పంపిణీ చేయబడింది. నిందితులు 2010-2011 మధ్య కాలంలో పంజాబ్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు హెరాయిన్ సరఫరా చేసేవారని పోలీసులు తెలిపారు. పంజాబ్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఏం టైం మాస్టారు.. వాడు చిల్ అయ్యాడు.. బాస్ బుక్కయ్యాడు!
ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లోని పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి కుర్చీపై కూర్చుని మద్యం గ్లాసులో పోసుకున్న వ్యక్తి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో మద్యం సేవించిన వ్యక్తిని అరెస్టు చేయడంతో పాటు ఆ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అధికారిని సస్పెండ్ చేశారు. ఘటన సహరాన్‌పూర్‌లోని ఖతా ఖేరీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇమ్రాన్ అనే వ్యక్తి ఫోటో నెట్టింట వైరల్ కాగా.. ఆ ఫొటోలో ఆ మద్యం సేవిస్తున్న వ్యక్తి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి సచిన్ త్యాగి కూర్చునే కుర్చీలో కూర్చుని మద్యం గ్లాసులో పోసుకోవడం కనిపించింది. అసలేం జరిగిందంటే.. మార్చిలో హోలీ సందర్భంగా ఇమ్రాన్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అధికారి కుర్చీలో కూర్చుని మద్యం సేవించాడు. ఆ సమయంలో టేబుల్‌పై ‘చక్నా’ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ ఉంచబడ్డాయి. ఆ సమయంలో తీసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పోలీసుల వద్దకు చేరింది. ఈ ఫోటో పోలీసుల దృష్టికి రావడంతో వెంటనే ఎస్‌ఎస్పీ విపిన్ తడా సచిన్ త్యాగిని సస్పెండ్ చేశారు. పోలీసులు కూడా కొద్ది రోజుల క్రితం నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.
ఈ పెళ్లి గౌన్ కి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు.. ఎందుకో తెలుసా?
ప్రతి ఒక్కరికి జీవితంలో పెళ్లి అనేది స్పెషల్. ఆ రోజు అందరి కంటే డిఫరెంట్ గా ఉండాలని అనుకుంటారు. కారణం పెళ్లికి వచ్చిన వాళ్లంతా వారి ధరించిన దుస్తుల పైనే చూపుంటుంది. అందుకే వెడ్డింగ్ డ్రెస్ ను స్పెషల్ గా డిజైన్ చేసుకుంటారు. ఓ అమ్మాయి వెడ్డింగ్ గౌన్ అయితే ఏకంగా, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరింది. ఏంటి ఆ గౌను ప్రత్యేకత అని ఆలోచిస్తున్నారు. దుస్తులు, నగలు ఇష్టపడని మహిళలు ఎవరు ఉండరు. అలంకరణ అమ్మాయిలకు మరింత అందాన్ని తీసుకువస్తుంది. అంత ఇష్టంగా ధరించే దుస్తులను ఆభరణాలతో డిజైన్ చేస్తే ఇంక ఎంత అద్భుతంగా ఉంటుంది. ఓ యువతి క్రిస్టల్స్‌తో తన పెళ్లి గౌను డిజైన్ చేయించుకుంది. ఆ గౌన్ ఏకంగా గిన్నీస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. ఈ వెడ్డింగ్ గౌనులో 50,890 క్రిస్టల్స్‌ని ఉపయోగించి డ్రెస్‌ను తయారు చేశారు. చేతి స్లీవ్స్ కూడా స్ఫటికాలతో అలంకరించారు. ఈ గౌనును ఇటాలియన్ బ్రైడల్ ఫ్యాషన్ బ్రాండ్ డిజైన్ చేశారు. మైఖేలా ఫెర్రెరో ఫ్యాషన్ షోలో ప్రదర్శించారు. ఈ డ్రెస్ తయారు చేయడానికి దాదాపు 4నెలల టైం పట్టింది. పెళ్లి రోజున మోడల్ మార్చే గెలానీ కావ్-అల్కాంటే ఈ దుస్తులను ధరించింది. ప్రస్తుతం ఈ ఆకర్షణీయమైన గౌను గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ వస్త్రం ప్రత్యేకతను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ట్విటర్ పేజీలో పంచుకున్నారు. గతంలో రికార్డు ఓజ్డెన్ గెలిన్లిక్ మోడా తసరిమ్ లిమిటెడ్ (టర్కీ) పేరుతో ఉంది. 45,024 క్రిస్టల్‌తో టర్కీలోని ఇస్తాంబుల్‌లోని ఫోరమ్ ఇస్తాంబుల్ షాపింగ్ మాల్‌లో 29 జనవరి 2011న ప్రదర్శించారు.
వివాదాస్పదం అంటూనే 100 కోట్లు వసూళ్ళు
అదా శర్మ మెయిన్ రోల్ ప్లే చేసిన ‘ది కేరళ స్టొరీ’ సినిమా ఇండియాలో సెన్సేషనల్ రన్ ని మైంటైన్ చేస్తోంది. వివాదాలు అడ్డొచ్చినా, రాష్ట్రాలకి రాష్ట్రాలే సినిమాని బాన్ చేసినా కలెక్షన్స్ మాత్రం పీక్ స్టేజ్ లో ఉన్నాయి. రోజు రోజుకీ కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి కానీ ఇప్పటివరకూ డ్రాప్ కనిపించలేదు. డే 1 కన్నా డే 7 ఎక్కవ కలెక్షన్స్ ని రాబట్టింది అంటే ది కేరళ స్టొరీ సినిమా ఏ రేంజ్ లో బుకింగ్స్ ని రాబడుతుందో అర్ధం చేసుకోవచ్చు. ప్రాపగెండానా లేదా ఇంకోకటా అనేది పక్కన పెడితే ఒక లేడీ ఓరియెంటెడ్ చిన్న సినిమా, కేవలం 16 కోట్ల బడ్జట్ తోనే రూపొందిన సినిమా… ఈరోజు వారం తిరిగే లోపు 82 కోట్లని రాబట్టడం గొప్ప విషయమే. ఈరోజు నుంచి వీకెండ్ మొదలవుతుంది కాబట్టి మండేకి ది కేరళ స్టొరీ సినిమా 100 కోట్ల మార్క్ ని చేరుకోవడం గ్యారెంటీ. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ది కేరళ స్టొరీ ఓవరాల్ థియేట్రికల్ రన్ లో 250 కోట్ల వరకూ రాబట్టే అవకాశం ఉంది. తమిళనాడు, కేరళ, వేస్ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో ది కేరళ స్టొరీ సినిమాని ఎంతగా ప్రభుత్వాలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయో మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు ది కేరళ స్టొరీ సినిమాకి అంతే అండగా నిలుస్తున్నాయి.
తగ్గేదేలే.. మాస్ మహారాజా సంభవం లోడింగ్!
సినిమా పోయింది.. ఇంటికెళ్లిపోతామా? సినిమా హిట్ అయింది.. తీయడం మానేస్తామా? సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా.. ఇంకో సినిమా చేయాల్సిందే! నేనింతే సినిమాలో రవితేజ చెప్పిన డైలాగ్ ఇది. అందుకే హిట్, ఫట్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. గతేడాది మూడు సినిమాలతో థియేటర్లోకి వచ్చిన రవితేజ.. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సినిమాలతో అలరించాడు. అందులో వాల్తేరు వీరయ్య హిట్, రావణాసుర ఫట్. అయితే ఏంటి మరో కొత్త సినిమాతో దూసుకొస్తున్నాడు మాస్ రాజా కాకపోతే ఈసారి బౌండరీలని దాటి పాన్ ఇండియా టచ్‌తో వస్తున్నాడు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’.. దసరా టార్గెట్‌గా అక్టోబర్ 20న రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
మరో కొత్త వివాదంలో ‘ఆదిపురుష్’! ఈ కర్ణుడి కష్టాలేంటో?
ఆదిపురుష్ సినిమాకు వివాదాలు కొత్త కాదు. ఈ సినిమా స్టార్ట్ అయిప్పటి నుంచి ఏదో ఓ వివాదం నడుస్తునే ఉంది. ముఖ్యంగా టీజర్ చూసిన తర్వాత ఆదిపురుష్ పై అనుమానాలు పెరిగిపోయాయి. రామయాణాన్ని వక్రీకరిస్తున్నారనే విమర్శలు గుప్పుమన్నాయి. అయితే రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్ విమర్శలకు చెక్ పెట్టేసింది. టీజర్‌తో వచ్చిన గ్రాఫిక్స్ నెగెటివిటీని దూరం చేయడంతో పాటు.. సినిమాపై అంచనాలని కూడా పెంచేసింది. ఈ విషయంలో మేకర్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆదిపురుష్ ట్రెండింగ్‌లో ఉంది. దాంతో డైరెక్టర్ ఓం రౌత్.. యే దోస్తీ అంటూ ప్రభాస్‌తో కలిసి ఉన్న ఓ బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసుకున్నాడు. అందులో పక్క పక్కనే 3డి గ్లాసెస్ పెట్టుకొని ట్రైలర్ చూస్తున్నారు ఇద్దరు. ఈ సందర్భంగా ఆదిపురుష్ ట్రైలర్ రెస్పాన్స్‌కి అందరికీ థాంక్స్ చెప్పాడు. ఇలాంటి సమయంలో ఆదిపురుష్ పై మరో కొత్త వివాదం తగులుకుంది. ఈ సినిమాపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డులో.. సనాతన్ ధర్మ ప్రచారకర్త సంజయ్ దీనానాథ్ తివారీ బాంబే హైకోర్టు న్యాయవాది ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రా ద్వారా ఫిర్యాదు చేశారు. ఆదిపురుష్ సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి ముందే స్పెషల్ స్క్రీన్ టెస్ట్ నిర్వహించాలని, సెన్సార్ షిప్ నిర్వహించాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఓ లెటర్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇప్పటికే ‘ఆదిపురుష్’ మేకర్స్ పోస్టర్స్, టీజర్‌లో చేసిన మిస్టేక్స్ సినిమాలో కూడా ఉంటే, సనాతన ధర్మానికి చెందిన వ్యక్తుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.