వైఎస్ వివేకా కేసులో సీబీఐ దూకుడు.. ఆ లెటర్ పై ఆరా
ఏపీ రాజకీయాలను కుదుపు కుదిపిన ఘటన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు..ఈ కేసుకి సంబంధించి రోజు రోజుకీ కీలక మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా వైయస్ వివేక హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. వివేకా లెటర్ పై సిబిఐ విచారణ వేగవంతం చేసింది. నేడు సిబిఐ విచారణకు హాజరైన వివేక పిఎ కృష్ణారెడ్డి, వంట మనిషి కొడుకు ప్రకాష్ ద్వారా పలు విషయాలు సేకరించారు సీబీఐ అధికారులు. ఇద్దరిని కలిపి విచారిస్తున్నారు సిబిఐ అధికారులు. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.వివేకా ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న లక్ష్మీదేవి కుమారుడు ప్రకాష్. వైయస్ వివేక హత్య జరిగిన రోజు లెటర్ దాచి పెట్టడంపై ప్రకాష్ ను విచారిస్తుంది సిబిఐ… నిన్న పిఎ కృష్ణారెడ్డిని విచారించి వాంగ్మూలం నమోదు చేసుకుంది సిబిఐ…నేడు మరోసారి కృష్ణారెడ్డి వంట మనిషి కొడుకు ప్రకాష్ లను విచారిస్తుంది సిబిఐ.. పిఏ కృష్ణారెడ్డి ద్వారా లెటర్ ను దాచి పెట్టాడని ప్రకాష్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైయస్ వివేకా లెటర్ పై కూపీ లాగుతుంది సిబిఐ.
మణప్పురంపై ఈడీ దెబ్బ
దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ బుధవారం నష్టాలతో ముగిసింది. గ్లోబల్ మార్కెట్‌లోని ప్రతికూల పరిస్థితులు ఇండియన్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ద్రవ్య విధానానికి సంబంధించి ఈ రోజు రాత్రి ఒక నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత ప్రదర్శించారు. ఫలితంగా.. సూచీలు నేల చూపులు చూశాయి.సెన్సెక్స్ 161 పాయింట్లు కోల్పోయి 61 వేల 193 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయి 18 వేల 89 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 10 కంపెనీలు మాత్రమే లాభాలు ఆర్జించగా మిగతా 20 కంపెనీలు నష్టాల బాటలో నడిచాయి.సెన్సెక్స్‌లో హిందుస్థాన్ యూనీలీవర్ కంపెనీ షేరు ధర ఒకటిన్నర శాతం పెరగ్గా.. ఎయిర్‌టెల్, టెక్ మహింద్రా ఒకటిన్నర శాతం చొప్పున డౌన్ అయ్యాయి. రంగాల వారీగా పరిశీలిస్తే.. ఏవియేషన్ సెక్టార్‌లోని ప్రధాన సంస్థలైన ఇండిగో మరియు స్పైస్‌జెట్ స్టాక్స్ వ్యాల్యూ వరుసగా ఆరు మరియు ఐదు శాతం చొప్పున పెరిగాయి.వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. మణప్పురం ఫైనాన్స్ షేర్ల విలువ 14 శాతం పడిపోయింది. కేరళలోని ఈ కంపెనీ బ్రాంచ్‌ల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వెలువడటం స్టాక్‌ల పనితీరుపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపింది. ఆర్బీఐ అనుమతి లేకుండా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ.. మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.
ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు.. నాకే పాఠాలా?
ఏపీలో పొత్తులపై చంద్రబాబు స్పందించారు. పొత్తుల గురించి మీకేం తొందర.. 45 ఇయర్స్ ఇండస్ట్రీ ఎప్పుడేం చేయాలో నాకు తెలుసన్నారు చంద్రబాబు. విదేశీ విద్య ఎందుకు ఎత్తేశారో.. పెట్టుబడులు ఎందుకు రావడం లేదో సమాధానం చెప్పగలరా..? జరిగిన తప్పిదాలపై సమాధానాలు చెప్పమంటే వెన్నుపోటు అంటూ నన్ను విమర్శిస్తూ ఆవు కథ చెబుతారు.ఎవ్వడికవ్వాలి ఆవు కథ.ఏపీని ఈ విధంగా చేసి.. పైగా స్టిక్కర్లు వేస్తారా..?6093 అని మీ మొహల మీద స్టిక్కర్లు వేసుకోండి.ద్విచక్ర వాహానాలు కొనుగోళ్లు పడిపోయాయి.కోనుగోలు శక్తి పడిపోయింది.ఇప్పుడు లూటీలు ఎక్కువ అవుతాయి.పోలవరాన్ని నాశనం చేశారు.డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి కారణం జగన్ ప్రభుత్వమేనని నివేదికిస్తే.. మాపై విమర్శలు చేస్తున్నారు.ఐదేళ్ల క్రితం నేను చేసిన శంకుస్థాపనలకు మళ్లీ శంకుస్థాపనలు చేస్తున్నారు.మళ్లీ మీ బిడ్డ వచ్చి ప్రారంభిస్తాడట.. మళ్లీ వస్తాడా ఈ బిడ్డ.జగన్ బిడ్డ కాదు.. క్యాన్సర్ గడ్డ.ఏమన్నా అంటే.. కులాల పేర్లతో తిట్టిస్తారు.నన్ను.. పవన్ను కులాలతో తిట్టిస్తున్నారు.ప్రజలు ఈ గొడవలు గురించి ఆలోచన చేయొద్దు.రాష్ట్రం గురించి ఆలోచన చేయీలి.స్టీల్ ప్లాంట్ ప్రైవేటేజేషన్ విషయంలో సీఎం జగన్ ఏ చేస్తున్నారు.అఖిలపక్షాన్ని తీసుకెళ్లడానికి ఎందుకు ముందుకు రావడం లేదు..?మెడలు వంచి ప్రత్యేక హోదా తేస్తానన్నారు.. ఏమైంది.రైతులకు గోనె సంచులు కూడా ఇవ్వలేకపోతున్నారు.ఆర్బీకేలు ఎత్తిపోయాయి.రేపు ఉభయ గోదావరి జుల్లా పర్యటనలకు వెళ్తున్నా.రైతుకు చిన్న కష్టమొచ్చినా వెళ్లిపోయేవాడిని.జగన్ చేయడం లేదు కాబట్టి.. మంత్రులు చేయరు.రజనీ కాంత్ ఏపీకి వచ్చి స్వేచ్ఛగా మాట్లాడకూడదా..?జగన్ నార్త్ కోరియాలో కిమ్ బ్రదరా..?జగన్ గురించి.. ఈ ప్రభుత్వం గురించి ఒక్క మాటైనా మాట్లాడారా..? ఎన్టీఆర్ గురించి.. హైదరాబాద్ గురించి రజనీ మాట్లాడితే తప్పా.పక్క రాష్ట్రం వాళ్లు తెలుగు వాళ్ల గురించి ఏమనుకుంటారు..? ఛీ అనుకోరా..?ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి.పవన్ నేను కలవకూడదా..?నేను పవన్ కలిస్తే భయమెందుకు..? ఉచ్చ పోసుకుంటున్నారా..?రీజనల్ కో-ఆర్డినేటర్ బాధ్యతలు తీసుకోనంటున్నారు.. ఆ పార్టీ నేతలు.
కప్పులో టీ లేదు.. ఇక తుఫాన్ ఎక్కడిది?
సుప్రీంకోర్టు నిర్ణయం పవిత్రమైన నిర్ణయం అని అభివర్ణించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అన్ని రకాలుగా ఆలోచించాకే అప్పట్లో సిట్ ఏర్పాటు చేశాం.దీనిని టీడీపీ వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తప్పు చేశారు కాబట్టే భయపడుతున్నారు. రాష్ట్ర సంపదనను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. దేశంలోనే అతిపెద్ద స్కాం అమరావతి భూకుంభకోణం అన్నారు. అన్ని విషయాలు బయటకు వస్తాయి. రింగురోడ్డు స్కాం తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు ఎప్పుడైనా అరెస్టు అయ్యే అవకాశం ఉందన్నారు సజ్జల.రాజధాని అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడ టచ్ చేసినా స్కాంలే ఉన్నాయి.. అవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి.. చంద్రబాబు, లోకేష్ లకు భయం ఎందుకు? ఈ స్కాంలలో అరెస్టులు కూడా జరుగుతాయి. వారు కోర్టులకు వెళ్తే మేము అదేస్థాయిలో పోరాటం చేశాం. ఏంపీకుతారని మాట్లాడటం ఎందుకు? త్వరలోనే అన్నీ బయటకు వస్తాయి. సభాసంఘం ఇచ్చిన అంశాలపై విచారణ జరుగుతుంది. ఇందులో కక్ష సాధించేదేమీ లేదు. మాకు అవసరం లేదు అన్నారు సజ్జల. పైపైన రాజకీయాల కోసం మేము విచారణ చేయటం లేదు.
సీట్ బెల్ట్ లేదని టూవీలర్ యజమానికి 1000 జరిమానా
సాధారణంగా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారికి ట్రాఫిక్ పోలీసులు జరిమానాను విధిస్తూ ఉంటారు. బీహార్‌లో ఓ ద్విచక్ర వాహనదారుడు సీటు బెల్టు పెట్టుకోనందుకు విచిత్రమైన ట్రాఫిక్ చలాన్ అందుకున్నాడు. 2020లో ట్రాఫిక్ ఉల్లంఘన కారణంగా సమతిపూర్‌లో ఈ సంఘటన జరిగిందని, ఇప్పటికే చలాన్ జమ అయినట్లు తెలిసిందని వాహనదారుడు కృష్ణకుమార్ ఝా తెలిపారు. 2020లోని చలానా మెసేజ్ ఇప్పుడు వచ్చినట్లు ఆయన తెలిపారు. అది కూడా సీట్ బెల్ట్ ధరించలేదని వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. “నా దగ్గర స్కూటీ ఉంది. ఏప్రిల్ 27న నేను బెనారస్ (వారణాసి) వెళుతున్నాను. నేను రైలులో ఉన్నప్పుడు, నా పేరుపై రూ.1,000 చలాన్ జారీ చేయబడిందని నాకు మెసేజ్ వచ్చింది. నేను వివరాలను చూసినప్పుడు. 2020 అక్టోబర్‌లో సీట్‌బెల్ట్ ధరించనందుకు అని అందులో పేర్కొన్నారు” అని వాహనదారుడు వెల్లడించాడు. టూ వీలర్ నడిపితే సీట్‌బెల్ట్ చలానా రావడంతో అతను ఆశ్చర్యపోయాడు. అనంతరం ట్రాఫిక్ విభాగాన్ని సంప్రదించగా.. ఏదో ఒక లోపం కారణంగా చలాన్ రూపొందించబడి ఉండవచ్చని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.”కృష్ణకుమార్ ఝా అందుకున్న చలాన్ మాన్యువల్‌గా జారీ చేయబడింది. ఇప్పుడు వీటన్నింటినీ ఈ-చలాన్‌లుగా కవర్ చేసే ప్రక్రియలో ఉన్నాము. లోపం ఎక్కడ జరిగిందో నేను తనిఖీ చేస్తాను” అని బీహార్ ట్రాఫిక్ పోలీసు అధికారి బల్బీర్ దాస్ చెప్పారు.
అమరావతి R5 జోన్ పై హైకోర్టులో కీలక వాదనలు
అమరావతి R5 జోన్ పై హైకోర్టు విచారణలో కీలక వాదనలు జరిగాయి. ఇరువైపులా వాదనలు వినిపించారు పిటిషనర్స్, ప్రభుత్వం. ప్రభుత్వ న్యాయవాదుల వాదనల ప్రకారం R2 జోన్ లో 18 వేల ఎకరాలు రైతులకు కేటాయింపులు జరిగాయంది ప్రభుత్వం. R5 లో 700 ఎకరాలు మాత్రమే ఇళ్ల స్థలాలకు తీసుకున్నామంది ప్రభుత్వం. రైతులు సీఆర్డీఏ కి ఇచ్చిన భూమిని ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనులకు వినియోగించుకోవచ్చని ప్రభుత్వం తన వాదనల్లో పేర్కొంది. 5 వేల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించామని హైకోర్టుకి తెలిపింది ప్రభుత్వం. చాలా తక్కువ మందికి మాత్రమే కేటాయింపులు జరగాల్సి ఉందని కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. పిటిషనర్స్ న్యాయవాదుల వాదనలు ఎలా ఉన్నాయంటే.. 5 వేల టిడ్కో ఇళ్ళు ఉండగా అవి కేటాయించకుండా…మళ్ళీ సెంటు భూమి ఇస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు. రాజధానిలో అభివృద్ధి పనులను నిలిపివేసిన ప్రభుత్వం నవరత్నాల పేరిట ఇళ్ల స్థలాలు కేటాయిస్తోందని వాదించారు. ఇలా చేయడం అమరావతిలో మాస్టర్ ప్లాన్ మార్పు చేయడమేనని హైకోర్టుకి తెలిపారు.
ఎట్టకేలకు సాధించారు.. కేరళ స్టోరీపై బ్యాన్
ది కేరళ స్టోరీ సినిమా చుట్టూ వివాదాలు ముసురుతూనే ఉన్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యినప్పటినుంచి సినిమాను నిలిపివేయాలంటూ కేరళ ప్రజలు, ప్రభుత్వం పోరాడుతూనే ఉన్నారు. 32 వేల మంది అమ్మాయిలు కనిపించకుండా పోయిన ఒక మిస్టరీ ఈ సినిమాలో ఉంది. మతమార్పిడి కోసం తీవ్రవాదులు ఎంత దిగజారి ప్రవర్తిస్తారు. మతం మార్చిన తరువాత ఆ యువతులను ఎలా సెక్స్ రాకెట్ లోకి దింపుతారు.. తీవ్రవాదులుగా ఎలా మారుస్తున్నారు..? అనేది కళ్ళకు కట్టినట్లు చూపించాడు డైరెక్టర్ సుదీప్తో సేన్. కేవలం టీజర్ రిలీజ్ చేసి మంట పుట్టించాడు. ఇక మంట అడవిని కాల్చేసింది. కేరళ ప్రభుత్వం సినిమాపై కళ్ళెర్ర జేసింది. సినిమను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. అంతేనా సుప్రీం కోర్టు వరకు వెళ్లి.. స్టే కూడా తీసుకురావాలనుకుంది. అయితే రాజు తలుచుకుంటే.. దెబ్బలకు కొదువా అన్నట్లు.. ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఈ సినిమాను ఆపడం ఒక లెక్క.
బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయ్
ప్రముఖ నటుడు జగపతిబాబు కీలక పాత్రపోషించిన ‘రామబాణం’ చిత్రం శుక్రవారం జనం ముందుకు రాబోతోంది. హీరో గోపీచంద్ అన్నయ్యగా ఈ సినిమాలో జగపతిబాబు నటించారు. శ్రీవాస్ దర్శకత్వంలో టి.జి. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలోని విశేషాలను జగపతిబాబు పాత్రికేయులతో పంచుకున్నారు. ఈ మూవీ యాక్సెప్ట్ చేయడానికి కారణం చెబుతూ, “ఇప్పుడన్నీ హారర్, యాక్షన్, థ్రిల్లర్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఫ్యామిలీ డ్రామా వచ్చి చాలా కాలమైంది. అలాగే గోపీచంద్, శ్రీవాస్, నేను కలిసి గతంలో ‘లక్ష్యం’ చేశాం. ఇది మెయిన్ ఎట్రాక్షన్. అలాగే ‘రామబాణం’లో అన్నదమ్ముల కాన్సెప్ట్ అద్భుతంగా కుదిరింది. గతంలో చేసిన ‘శివరామరాజు’ కూడా కూడా అన్నదమ్ముల కథే. ఆ సినిమా చూసి విడిపోయిన కొన్ని కుటుంబాలు కలిశాయి. ‘రామబాణం’ కూడా చాలా మంచి ఉద్దేశంతో చేసిన సినిమా.” అని అన్నారు. హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత హాయిగా ఉందని చెబుతూ, “హీరో అనేది పెద్ద భాద్యత. ఇప్పుడా ఒత్తిడి లేకపోవడంతో దర్శకుడు కోరుకునే పెర్ఫార్మెన్స్ డెలివర్ చేయడం ఇంకా సులువవుతుంది. ఇప్పటి వరకూ దాదాపు 70కి పైగా క్యారెక్టర్ రోల్స్ చేశాను. అయితే ఇందులో చెప్పుకోవడానికి ఏడెనిమిది సినిమాలే వున్నాయి. కొన్ని సినిమాల్లో సరిగ్గా వాడుకోలేదనే చెప్పాలి. ‘రామబాణం’లో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ అన్నదమ్ముల కథలో ఇద్దరి పాత్రలు పండితేనే సినిమా ఆడుతుందని గోపీచంద్ ఖచ్చితంగా ఉన్నారు. అది క్లైమాక్స్ లో తెలుస్తుంది. అందుకు స్కోప్ ఇచ్చిన గోపీచంద్ ని మెచ్చుకోవాలి” అని అన్నారు. తన భార్యగా నటించిన ఖుష్బూ గురించి చెబుతూ, “ఆమె నాకు చిన్నప్పటి నుండీ స్నేహం ఉంది. కానీ ఎప్పుడూ సినిమా చేయడం కుదరలేదు. తను మంచి కంఫర్ట్ బుల్ ఆర్టిస్ట్. తనతో ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ వర్క్ చేస్తాను” అని చెప్పారు.
లక్నో జట్టుకి బిగ్ షాక్.. కేఎల్ రాహుల్ దూరం
లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకి భారీ షాక్ తగిలింది. అత్యంత కీలక ఆటగాడు, ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఈ సీజన్ మొత్తానికే దూరం కానున్నాడని సమాచారం. హోమ్‌గ్రౌండ్‌లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో.. బౌండరీ లైన్‌వైపు దూసుకుపోతున్న బంతిని ఆపబోతూ, కేఎల్ రాహుల్ గాయపడిన విషయం తెలిసిందే! తొడ కండరానికి గాయం కావడంతో.. అతడు మైదానంలోనే కాసేపు విలవిల్లాడాడు. తిరిగి నిలబడలేకపోయాడు. దీంతో.. ఫిజియోలు వచ్చి, వెంటనే అతడ్ని మైదానం నుంచి తీసుకెళ్లారు. గ్రౌండ్ చుట్టూ కాసేపు చక్కర్లు కొట్టించారు. అనంతరం.. బ్యాటింగ్ ఆర్డర్‌లో చివర్లో వచ్చిన అతగాడు, బ్యాటింగ్ చేసేందుకు కూడా తడబడ్డాడు. పరుగులు తీయడానికి చేతకాక.. క్రీజులోనే నిల్చుండిపోయాడు. దీన్నిబట్టి.. అతనికి ఎంత తీవ్రమైన గాయమైందో అర్థం చేసుకోవచ్చు. కేఎల్ రాహుల్ గాయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం అతడు లక్నో జట్టుతోనే ఉన్నాడు. బుధవారం చెన్నైతో మ్యాచ్‌ను వీక్షించిన తర్వాత అతడు జట్టును వీడుతాడు. ముంబైలో బీసీసీఐ ఆధ్వర్యంలో అతనికి స్కానింగ్ పరీక్షలు జరుగుతాయి. అతనితో పాటు జయదేవ్ ఉనాద్కడ్ పరిస్థితిని సైతం బీసీసీఐ సమీక్షిస్తుంది’’ అంటూ చెప్పుకొచ్చారు