దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో అరుణాచలం ముందుంటుంది. అరుణాచలం దర్శనానికి ముందు జీవితం వేరు.. దర్శనం తర్వాత జీవితం వేరు అని అంటుంటారు. ఇక్కడ గిరిప్రదక్షిణ చేసి శివుడిని దర్శించుకుంటే.. అంతా మంచే జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఎంతో విశేషమైన క్షేత్రంగా అలరారుతున్న అరుణాచలంను నిత్యం ఎంతో మంది భక్తులు సందర్శిస్తుంటారు. ఎందరో సెలబ్రిటీలు కూడా అరుణాచల శివుడిని దర్శించుకుంటారు. తాజాగా సీనియర్ హీరోయిన్ స్నేహ తన భర్త ప్రసన్న కుమార్‌తో కలిసి అరుణాచలం వెళ్లారు. అయితే ఆమె అరుణాచలంలో అపచారం చేశారు.
అరుణాచలంలో స్నేహ తన భర్త ప్రసన్నకుమార్‌తో కలిసి గిరిప్రదక్షిణ చేశారు. తెల్లవారుజామున భార్యాభర్తలిద్దరూ కాలినడకన గిరి ప్రదక్షిణ చేశారు. దారిలో ఆలయాల దగ్గర కొబ్బరికాయలు కొడుతూ నడక సాగించారు. అయితే కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వీళ్లిద్దరూ చెప్పులు, శాండిల్స్ ధరించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది చూసిన భక్తులు స్నేహ దంపతులపై మండిపడుతున్నారు. చెప్పులు వేసుకుని గిరి ప్రదక్షిణ చేయడమేంటి?, అరుణాచలంలో స్నేహ అపచారం చేసింది, ఇది మహాపాపం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం తెలియక చేసుంటారని అండగా నిలుస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు స్నేహ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.
Also Read: SRH-HCA: ఎస్‌ఆర్‌హెచ్, హెచ్‌సీఏ మధ్య ముదురుతున్న వివాదం.. జోక్యం చేసుకోవాలని బీసీసీఐకి రిక్వెస్ట్!
‘ప్రియమైన నీకు’ చిత్రంతో స్నేహ తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. హనుమాన్ జంక్షన్, వెంకీ సినిమాల్లో ఆకట్టుకున్న స్నేహ.. శ్రీరామదాసు, రాధాగోపాలం, పాండురంగడు సినిమాలతో స్టార్ అయ్యారు. అమరావతి, రాజన్న లాంటి డిఫెరెంట్ సినిమాలు కూడా చేశారు. సన్నాఫ్ సత్యమూర్తి, వినయ విధేయ రామ చిత్రాల్లో కీలక పాత్రలు చేశారు. కెరీర్ సక్సెస్‌ఫుల్ సమయంలోనే నటుడు ప్రసన్న కుమార్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు.