ఇకపై విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబయికి డైరెక్ట్ విమాన సర్వీస్‌లు నడవనున్నాయి. గన్నవరం నుండి ముంబైకి విమాన సర్వీసును ఎంపీలు బాలశౌరి, ఎంపీలు కేశినేని చిన్ని ప్రారంభించారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లు గన్నవరం నుంచి ప్రారంభం అయ్యాయని ఎంపీ బాలశౌరి వెల్లడించారు.
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ.. ఈ ప్రజాస్వామ్యంలో దమ్ము ధైర్యంతో ప్రశ్నించే నాయకుడు ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది.. అలాంటి దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. అందుకే రాష్ట్రంలో కొన్ని సమస్యలకైనా పరిష్కారం దొరికిందని చెప్పారు. బందర్ పోర్ట్ రావడానికి తన వంతు కృషి చేశానని.. బందరులో…
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు నుంచి భారీ ర్యాలీగా జనసేన కార్యాలయానికి వచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఎంపీతో పాటు ఆయన కుమారుడు అనుదీప్ కూడా జనసేనలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కీలక నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు పాల్గొన్నారు.
MP Balashowry Vallabbhaneni Revels Why He Is Joining Janasena: రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు గత ఐదేళ్లలో అనుకున్నంతగా జరగలేదు అని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఎన్నిసార్లు చెప్పినా అభివృద్ధిపై స్పందించడం లేదన్నారు. రాష్ట్రంను అభివృద్ధి చేస్తారన్న ఆలోచనతోనే జనసేనతో కలిసి నడుస్తున్నానని వల్లభనేని బాలశౌరి స్పష్టం చేశారు. 2004లో వైఎస్ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చానని, గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బందర్…
ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఓట్ల తొలగింపుల ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ విపక్షాల ఓట్లను తొలగించేందుకు భారీగా ఫామ్ 7ను వాడి ఫిర్యాదాలు చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ycp mp ready compliant on ap voter list. breaking news, latest news, telugu news, MP Balashowry , tdp, ycp
కృష్ణా జిల్లా వాసుల దశాబ్దాల కల బందరు పోర్టు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలో బందరు పోర్టు నిర్మాణానికి బీజం పడింది. శంఖుస్థాపన చేశారు. ఆ తర్వాత అప్పట్లో మారిన రాజకీయ పరిణామాలతో బందరు పోర్టు నిర్మాణం కాగితాలకే పరిమితం అయింది. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ పోర్టు నిర్మాణం కోసం కొంత ప్రయత్నం చేసింది. పోర్టు నిర్మాణం పేరుతో కొంత భూసేకరణ చేసి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసింది. ఈ…