Asaduddin Owaisi: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అనంత్‌నాగ్‌లో భారత సైనికుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారని, ప్రభుత్వం మౌనంగా ఉందని మండిపడ్డారు. రాజౌరిలో కాశ్మీరీ పండిట్లతో, భారత సైనికులతో బుల్లెట్ల క్రికెట్ మ్యాచ్ జరుగుతోందని విమర్శలు చేశారు. క్రికెట్ మ్యాచ్కు ముందే ఈ ఆటను ముగించాల్సిన అవసరం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ముందు ఈ బుల్లెట్ల ఆటను ఆపండని బీజేపీపై విరుచుకుపడ్డారు.
Read Also: Rajasthan: పేపర్ లీక్ కేసులో ఈడీ పట్టు.. ఇద్దరు RPSC అధికారులు అరెస్ట్
ప్రధాని మోడీని ఉద్దేశించి ఒవైసీ మాట్లాడుతూ.. పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి మన సైనికులను హతమార్చడంపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. పుల్వామా దాడి జరిగినప్పుడు ఆగ్రహం వ్యక్తం చేశారని.. కానీ ఆ తర్వాత కల్నల్.. డిప్యూటీ ఎస్పీని చంపేశారన్నారు. ఇప్పుడు అనంత్ నాగ్ ఘటనపై ఎందుకు స్పందిండం లేదు.. ప్రధాని మోడీ ఎందుకు ఉదాసీనంగా మారారని ప్రశ్నించారు.
Read Also: Puri Temple: పూరీ ఆలయంలో నిలిచిపోయిన స్వామి వారి సేవలు.. కారణమేంటంటే..?
ఇదిలా ఉంటే.. భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ గురించి ఓవైసీ మాట్లాడుతూ.. బీజేపీ కశ్మీర్ విధానం విఫలమైందని.. అందుకే ఇక్కడ పాక్ ఉగ్రవాదులు బుల్లెట్ల ఆట ఆడుతున్నారని అన్నారు. గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పాకిస్థాన్‌తో భారత్ క్రికెట్ మ్యాచ్ ఆడతారా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు బీజేపీ సమాధానం చెప్పాలన్నారు. అయితే.. అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో జరిగే క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.