దేశంలోని ప్రధాన ఆలయాలలో పూరీ జగన్నాథ్ ఒకటి. అయితే ఆ ఆలయంలో స్వామి సేవ కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలిచిపోయాయి. ఉదయం 8.30 గంటలకు మొదటి నైవేద్యాన్ని సమర్పించవల్సి ఉండగా.. సాయంత్రం 5.30 గంటలకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. అయితే స్వామి వారికి ఎలాంటి సేవలు చేయకపోవడం కారణం సేవకుల సమ్మె. ఒక పూజారి బలవంతంగా ఆలయంలోకి ప్రవేశించి పూజలు చేయడంపై నిరసన వ్యక్తం చేశారు.
Read Also: Mahadev Gambling App: ఈడీ దర్యాప్తులో సంచలన విషయాలు.. దుబాయ్లో పెళ్లికి హాజరైన బాలీవుడ్ ప్రముఖులు
ఓ నివేదిక ప్రకారం.. 2017 సంవత్సరంలో ఈ పూజారి కులాంతర వివాహం చేసుకున్నాడని ఆరోపిస్తూ.. అతన్ని ఆలయంలోకి ప్రవేశించకుండా నిషేధించారు. ఈ క్రమంలో ఆ పూజారి స్వామివారికి పూజలు నిర్వహించేందుకు ఆలయానికి చేరుకున్నాడు. దీనికి నిరసనగా సేవకులు సమ్మెకు దిగారు. అయినప్పటికీ.. ఆ పూజారి సప్తపురి అమావాస్య సందర్భంగా స్వామి వారికి సేవ చేశారు. మరోవైపు భక్తులు మాత్రం యథావిధిగా స్వామి వారి సేవలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2:10 గంటలకు శుద్ధి కర్మను నిర్వహించడానికి ఆలయ అధికారులు అంగీకరించడంతో.. మధ్యాహ్నం 2.20 గంటలకు పూజలు తిరిగి ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5.30 గంటలకు స్వామివార్లకు అల్పాహారం సమర్పించారు.
Read Also: Amit Shah: లాలూ, నితీష్ కుమార్‌పై తీవ్ర విమర్శలు.. దర్భంగా ఎయిమ్స్ పనులపై ఫైర్
ఈ వ్యవహారంపై ఆలయ ప్రధాన కార్యనిర్వహణాధికారి రంజన్ దాస్ మాట్లాడుతూ.. నిరసన చేపట్టిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు పూజారిపై నిషేధం ఉన్నప్పటికీ గర్భగుడిలో సేవ చేసేందుకు అతను ప్రయత్నించాడని.. ఇది ఆచార వ్యవహారాలకు అంతరాయం కలిగించిందని తెలిపారు. ఇదిలా ఉంటే.. తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశాడు పూజారి సింఘారి.. గత ఏడాది కూడా సేవ కార్యక్రమాలను నిర్వహించినట్లు చెప్పారు.