రాజస్థాన్ పేపర్ లీక్ కేసులో ఈడీ కీలక చర్యలు తీసుకుంది. రాజస్థాన్ పబ్లిక్ కమిషన్ సభ్యులు అనిల్ కుమార్ మీనా, బాబులాల్ కటారాలను అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. మూడు రోజుల పాటు ఈడీ కస్టడీ కోరింది. రాజస్థాన్ పోలీసులు వీరిపై కేసు నమోదు చేసిన తర్వాత ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో రాజస్థాన్ పోలీసులు చార్ట్ షీట్ కూడా దాఖలు చేశారు. దీంతో వారిని మరింత లోతుగా విచారించనుంది ఈడీ.
Read Also: CM KCR: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
ఈడీ విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. డిసెంబరు 21, 24 తేదీల మధ్య సీనియర్ టీచర్ గ్రేడ్-ఎల్ రిక్రూట్‌మెంట్ కోసం ఆర్‌పీఎస్‌సి పరీక్షను నిర్వహించిందని ఈడీ దర్యాప్తులో తేలింది. ఇందులో సాధారణ పేపర్ లీక్ కేసులో రాజస్థాన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కటారా పేపర్‌ను లీక్ చేసి మీనాకు విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఈ పేపర్లను అభ్యర్థులకు రూ. 8-10 లక్షలకు విక్రయించారని ఈడీ పేర్కొంది. అంతకుముందు 2023 జూన్ 5న.. ఈడీ 15 చోట్ల దాడులు చేసి అనేక పత్రాలు, డిజిటల్ రికార్డులను స్వాధీనం చేసుకుంది. అంతే కాకుండా.. బాబూలాల్ కటారా, అనిల్ కుమార్ మీనాకు చెందిన సుమారు రూ. 3.11 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసింది.
Read Also: Puri Temple: పూరీ ఆలయంలో నిలిచిపోయిన స్వామి వారి సేవలు.. కారణమేంటంటే..?
రాజస్థాన్ పేపర్ లీక్ కేసులో రాజకీయం మరింత హీటెక్కింది. ఈ విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శల దాడికి దిగుతుంది. మరోవైపు కాంగ్రెస్ నేత అలోక్ శర్మ మాట్లాడుతూ.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందని అన్నారు.