సోమాజిగూడ యశోద ఆస్పత్రి వద్ద మహిళా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మాజీ సీఎం కేసీఆర్ ను చూసేందుకు లోపలికి అనుమతించాలని నిరసనకు దిగారు. వారంతా.. సిద్దిపేట, సిరిసిల్ల నుంచి వచ్చిన వారిగా గుర్తించారు. అంతేకాకుండా.. ఆస్పత్రి ముందు లాంగ్ లీవ్ కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో.. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా అస్సలు వినడం లేదు. మరోవైపు.. ఆస్పత్రి వద్ద ఇతర పేషంట్స్ కి ఇబ్బంది కలుగుతుందని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా కానీ.. వినకుండా ఆస్పత్రి మెయిన్ గేట్ వద్ద మహిళలు ఆందోళన చేస్తున్నారు. దీంతో యశోద ఆస్పత్రి వద్ద మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
Read Also: TS Ministers: కేసీఆర్ను పరామర్శించిన మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ
అంతకుముందు.. కేసీఆర్ అభిమానులు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు భారీగా తరలిరావడంతో కేటీఆర్ వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత.. కేసీఆర్ కూడా ఓ వీడియో సందేశం ద్వారా.. అభిమానులు ఎవరూ ఆస్పత్రికి రావద్దుని సూచించారు. అయినప్పటికీ వినకుండా కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. ఆస్పత్రి వద్ద నినాదాలు చేస్తూ పోలీసులను ముప్పతిప్పలు పెడతున్నారు. ఇదిలా ఉంటే.. మహిళా పోలీస్ సిబ్బంది లేకపోవడంతో పోలీసులు ఏం చేయలేక చోద్యం చూస్తున్నారు. కేసీఆర్ ను చూడకుండా ఆస్పత్రి నుంచి కదలమని మహిళా కార్యకర్తలు అంటున్నారు.
Read Also: KCR: యశోద ఆస్పత్రికి రాకండి.. ప్రజలకు బీఆర్ఎస్ అధినేత విజ్ఞప్తి..