ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణ, పలు కీలక అంశాలపై రాహుల్ గాంధీతో చర్చించారు. భేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళన చేయాల్సిందే... నీళ్లు ఇవ్వాల్సిందేనని అన్నారు. కృష్ణా, గోదావరి నదుల నుండి తీసుకువచ్చిన అభ్యంతరం లేదని తెలిపారు. ఒక్క ఇల్లు కూలగొట్టిన ఊరుకునేది లేదు.. ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.
సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఉనికి లేకుండా చేయాలనేది తన అభిమతం అన్నారు. కేటీఆర్‌తోని కేసీఆర్ ఉనికి లేకుండా చేశాను.. కేసీఆర్ ఉనికి లేకుండా చేయడానికి ఆయన కొడుకునే వాడానని అన్నారు. ఇక భవిష్యత్తులో కేటీఆర్‌ని రాజకీయంగా లేకుండా చేయడానికి ఆయన బావ హరీష్ రావుని వాడుతానని తెలిపారు.
మాజీ మంత్రి, బీర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వట్లేదని ఆరోపించారు. కేంద్రం నుంచి రూ.500 కోట్లు వచ్చినా విడుదల చేయట్లేదని అన్నారు. గ్రామ పంచాయతీల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. సర్పంచ్లు ఆగమయ్యాం అని తనకు వినతిపత్రం ఇస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షం తట్టిలేపితే కానీ ఈ ప్రభుత్వానికి సోయి లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం గ్రామ పంచాయతీల ట్రాక్టర్లకు…
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లలో ఏపీ పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి సరిదిద్ద లేనంత నష్టం జరిగిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని బాగు చేస్తుందని అన్నారు. ఏపీ గ్లోబల్ లీడర్ గా తయారు చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నెముక ఇరిగింది అని తాను ముందే చెప్పానని తెలిపారు. గత ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి విడిచారు, సముద్రంలో పోసిన నీళ్లకు కరెంట్ బిల్లు కట్టామని చెప్పారు. మరోవైపు.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఫోన్ టాపింగ్ పై సమీక్ష జరపలేదని పేర్కొన్నారు. ఫోన్ టాపింగ్ అంశం అధికారులు చూసుకుంటున్నారని.. దానితో తనకు ఎలాంటి సంబంధం లేదని సీఎం…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపటి నుండి పరిపాలన మీద దృష్టి సారిస్తున్నామని తెలిపారు. రుణమాఫీ పై ఫోకస్, విద్యాశాఖ మీద ఫోకస్, అన్ని హస్టల్స్ కి సన్న బియ్యం.. బీఆర్ఎస్ ఇచ్చిన సన్న బియ్యం కాదు.. నిజమైన సన్నబియ్యం ఇస్తామని అన్నారు. త్వరలో బ్యాంకర్ల సమావేశం ఉంటుందన్నారు. రుణమాఫీ పై చర్యలు, రైతుల రుణాలు ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైతుల రుణాలు మాఫీ కోసం…
ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు చిట్ చాట్ నిర్వహించారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీని 2, 3 టైర్ సిటీస్ గా విస్తరణ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. ఫార్మా ఇండస్ట్రీ పూర్తిగా రెడ్ జోన్.. పొల్యూషన్ ఎక్కువ కాబట్టి క్లస్టర్ లు ఏర్పాటు చేసి విభజిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఉంటుంది.. ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మరోవైపు.. నల్గొండలో డ్రై పోర్ట్ ప్రపోజల్ పెడుతున్నాం.. ఏపీ…
సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలాన్ని అవసరాల కోసం వినియోగించుకుంటామని తెలిపారు. ప్రజాభవన్ లో ఉన్న ఆఫీసు కార్యాలయాన్ని ఉపయోగించుకుంటాను.. కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోం.. శాసన సభ భవనాలను సమర్థంగా వాడుకుంటామని ఆయన పేర్కొన్నారు.
ఎల్.బి నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు తొందర పడి మాట్లాడొద్దని సూచించారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు ఒత్తిడి తీసుకొద్ధామని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాతే బలమైన ప్రతిపక్షంగా మన గొంతు వినిపిద్దామని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని హుందాగా స్వీకరిద్ధామని సుధీర్ రెడ్డి…