ఎల్.బి నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు తొందర పడి మాట్లాడొద్దని సూచించారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు ఒత్తిడి తీసుకొద్ధామని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాతే బలమైన ప్రతిపక్షంగా మన గొంతు వినిపిద్దామని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని హుందాగా స్వీకరిద్ధామని సుధీర్ రెడ్డి…