కత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లోకి బీఆర్ఎస్ యూత్ నాయకులు చేరారు. టీపీసీసీ జనరల్ సెక్రెటరీ కుత్బుల్లాపూర్ నాయకుడు సొంటిరెడ్డి పున్నారెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ యూత్ నాయకుడు శివతో పాటు 100మందికి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. టీపీవర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి క పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి అండగా ఉంటామని అన్నారు.
Also Read : Telangana Congress party: కర్ణాటక ఫలితాలు తెలంగాణ రాజకీయాల్ని మలుపు తిప్పుతాయా..?
గతంలో ఏ ప్రభుత్వం కూడ ఇలా పోలీస్ లతో ఇబ్బంది పెట్టించలేదన్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు పోలీస్ లను ప్రయోగించి ఇబ్బంది పెడుతున్నాయన్నారు. పార్టీలో వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది కలుగచేసిన అండగా ఉంటానని మాట ఇస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ లో చేరినవారందరిని ఆహ్వానిస్తున్నానని, కుత్బుల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరావేయాలి అన్నారు. పార్టీ కోసం నిరంతర కష్టపడాలని తెలిపారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇదిలా ఉంటే.. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడంపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ ఇదే ఫలితాలు రిపీట్ అవుతాయన్నారు.
Also Read : Karnataka: సీఎం పదవికి బసవరాజ్ బొమ్మై రాజీనామా..